Kajol: బాలీవుడ్లో షారుఖ్ ఖాన్- కాజోల్ జోడీకున్నక్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాజీఘర్, దిల్వాలే దుల్హానియా లేజాయేంగే, కుచ్కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, దిల్వాలే వంటి ఎన్నో సక్సస్ఫుల్ సినిమాల్లో వీరిద్దరు జంటగా నటించి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వెండితెరపై రొమాంటిక్ జోడీగా పేరుపొందిన వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని ఒకానొక సమయంలో అందరూ అనుకున్నారు. అయితే, అవన్నీ కేవలం కల్పితాలేనని తేలింది. ఆ తర్వాత షారుఖ్ గౌరీఖాన్‌ను వివాహమాడారు. కాజోల్ అజయ్ దేవగణ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.
కాగా, షారుఖ్ తనయుడు ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్డైన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు మూడు వారాలు జైలులోనే గడిపి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, నవంబరు 2న బాలీవుడ్ బాద్షా తన 56వ పుట్టిన రోజును జరుపుకున్నారు. దీంతో పలువురు ప్రముఖులు అతని పుట్టిన రోజుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కాజోల్ మాత్రం ఎలాంటి విషెస్ చెప్పలేదు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన కాజోల్కు.. షారుఖ్ పుట్టిన రోజున ఎందుకు విషెస్ చెప్పలేదని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కాజోల్.. ఆర్యన్ తిరిగి రావడంతో షారుఖ్ కలలన్నీ ఫలించాయని.. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఆయను ఏముంటుందని తనదైన స్టైల్లో బదులిచ్చింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kajol explain about why she didnt tell wishes to sharukh khan birth day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com