kajal: ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వం ఎప్పటినుంచో కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ ఏదైనా సరే.. ఈ మార్క్ మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటి ఎంట్రీలను చాలానే చూశాం. అయితే, తాజాగా, స్టార్ హీరోయిన్ల భర్తలు కూడా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాజల్- కిచ్లు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. వీరిద్దరూ ప్రేమించి ఇటీవల విహారం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు, కాజల్ గర్భవతి అయినట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే కాజల్ తన భర్తను కడా సీనీ పరిశ్రమకు పరిచయం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తన వద్దకు వచ్చిన దర్శకులకు తన భర్తకు తాను నటించే సినిమాల్లో చిన్న పాత్రనైనా ఇప్పించేలా ప్రయత్నిస్తోందట. ఇప్పటికే వీరిద్దరూ తమ బిజినెస్ పరంగా ఓ షూట్లో పాల్గొన్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గౌతమ్‌కి కూడా సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు నిజమైతే.. కాజల్ తన భర్తను ముందుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో నడిపించడంలో ఎటువంటి తప్పులేదని పలువురు భావిస్తున్నారు. గౌతమ్ కూడా చూడటానికి హీరోని తలపిస్తాడు. అయితే, గౌతమ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ డైరెక్టర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కాగా, పెళ్లికి ముందు వరుస చిత్రాల్లో నటించిన కాజల్.. వివాహం తర్వాత తనభర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే మళ్లీ సినిమాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kajal husband may be chance to entry in films very soon
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com