https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లవర్స్ కి హ్యాండ్ ఇచ్చిన ఆ హాట్ బ్యూటీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఓ హాట్ బ్యూటీ కంటెస్ట్ చేయనుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దాంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ సదరు బ్యూటీ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒక్కసారిగా బిగ్ బాస్ లవర్స్ డీలా పడ్డారు. ఇంతకీ ఎవరా గ్లామర్ గర్ల్ అంటే..

Written By:
  • S Reddy
  • , Updated On : September 13, 2024 / 11:14 AM IST

    Bigg Boss 8 Telugu(39)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారంలో అడుగుపెట్టింది. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన షో నుండి బేబక్క ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. సోషల్ మీడియా స్టార్ బేబక్క హౌస్లో సత్తా చాటుతుందని ప్రేక్షకులు భావించారు. అంచనాలు తలక్రిందులు చేస్తూ వారం రోజులకే ఆమె ఇంటిబాట పట్టింది. ప్రస్తుతం హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణుప్రియ, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, నిఖిల్, పృథ్విరాజ్, సీత, ఆదిత్య ఓమ్ సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు.

    కాగా కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ అసంతృప్తి గా ఉన్నారు. పెద్దగా పేరున్న సెలెబ్స్ ఎవరూ రాలేదు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం మాత్రమే తెలిసిన ముఖాలు. సీరియల్ నటులు ప్రేరణ, నిఖిల్, యాష్మి, పృథ్విరాజ్ ఉన్నప్పటికీ అంతగా పాప్యులర్ కాదు. పైగా వీరందరూ కన్నడ వాళ్ళు. ఈ కారణాలతో టీఆర్పీ పెద్దగా రావడం లేదు. మొదటి వారం బిగ్ బాస్ తెలుగు 8 టీఆర్పీ ఆశించిన స్థాయిలో లేదని సమాచారం. ఈ క్రమంలో నష్ట నివారణ చర్యలు చేపట్టారట బిగ్ బాస్ మేకర్స్.

    వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా టాప్ సెలెబ్స్ ని హౌస్లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నారట. వారిలో జ్యోతి రాయ్ ఒకరంటూ కథనాలు వెలువడ్డాయి. జ్యోతిరాయ్ సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు లో జగతి పాత్ర చేసింది. ఆమె హీరో తల్లిగా కనిపించారు. నిజానికి జ్యోతిరాయ్ వయసు 40 ఏళ్ల లోపే నట. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో యూత్ లో విపరీతమైన ఫేమ్ రాబట్టింది.

    జ్యోతి రాయ్ హౌస్లో అడుగుపెడితే పండగే అని బిగ్ బాస్ లవర్స్ భావించారు. వారి ఆశలపై నీళ్లు చల్లింది జ్యోతిరాయ్. నేను బిగ్ బాస్ షోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. తాజా ఇంటర్వ్యూలో… నేను కన్నడ, తెలుగు బిగ్ బాస్ షోలలో కంటెస్ట్ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను నటిగా బిజీగా ఉన్నాను. 2025 లో నేను నటించిన 4 తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. కాబట్టి పుకార్లను నమ్మొద్దు. నాకున్న షెడ్యూల్స్ రీత్యా బిగ్ బాస్ షోకి రావడం లేదు, అని అన్నారు.

    కాగా గతంలో జ్యోతిరాయ్ కన్నడ బిగ్ బాస్ ఆఫర్ పై స్పందించింది. కన్నడ బిగ్ బాస్ మేకర్స్ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. కమిట్మెంట్స్ కారణంగా రావడం కుదరదని చెప్పానని జ్యోతిరాయ్ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి జ్యోతి రాయ్ తెలుగుతో పాటు కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదు.