Tollywood: తెలుగులో మళ్ళీ ఫ్యాన్ వార్స్ స్టార్ట్ అయ్యాయా..? హీరోల మధ్య లేని పోటీ అభిమానుల మధ్య ఎందుకు…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లలో చాలా మంది హీరోలు తమ ఫ్యాన్స్ పట్ల చాలా బాధ్యత గా వ్యవహరిస్తూ ఉంటారు...అలాగే ఎదుటి హీరో కి వాళ్ళకి మధ్య మంచి సన్నిహిత సంబంధం అయితే ఉంటుంది...

Written By: S Reddy, Updated On : September 13, 2024 11:22 am

Tollywood(5)

Follow us on

Tollywood: ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా వాళ్లకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కూడా ఏర్పడుతుంది. ఇక అందులో భాగంగానే కొంతమంది వాళ్ళ అభిమానులకు హీరో మాత్రమే చాలా గొప్పగా కనిపిస్తాడు. ఇక మిగిలిన హీరోలేవ్వరు తమ హీరోని బీట్ చేయలేరు అంటూ వాళ్ళ మీద తీవ్రమైన విమర్శలను చేస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే హీరోలు అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ జరుగుతుందనే విషయాలు మనం ఇంతకుముందు చాలా సార్లు విన్నాం. కానీ ఇప్పుడు కూడా అలాంటి పోటీ వాతావరణం ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరికీ అభిమానులు ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా భారీగా ఫ్యాన్ వార్స్ ను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీని ద్వారా చాలామంది యూత్ తమ ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే మన స్టార్ హీరోలందరూ చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు.

కానీ వాళ్ళని అభిమానించే మనం మాత్రం మా హీరో గొప్ప అంటూ చాలావరకు తీవ్రమైన పదజాలంతో గొడవ పడుతూ ఉంటాము. నిజానికి హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. కానీ అభిమానులు మాత్రం వాళ్ళ అభిమాన హీరోకి చిన్న ఇబ్బంది జరిగిన, లేదంటే సినిమా మీద ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేసిన కూడా వాళ్ళని తీవ్రస్థాయిలో చీల్చి చెండాడుతూ వాళ్ల చేత సారీ చెప్పించేంత వరకు పోరాడుతూనే ఉంటారు.

మరి ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి అభిమానులు కూడా ఇప్పుడు ఫ్యాన్ వార్స్ ను నిర్వహిస్తున్నారు. వీటివల్ల తమ అభిమాన హీరోల ఇమేజ్ కి కూడా డ్యామేజ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక మనల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో ఆ వ్యక్తి పట్ల ఇతరులకు సానుభూతి వచ్చి హీరోని వాళ్ళు విమర్శించే అవకాశాలు అయితే ఉన్నాయి.

కాబట్టి హీరోలందరి అభిమానులు కలిసి మెలిసి అన్నదమ్ముల లాగా ఉంటే మంచిది. అలా కాకుండా బ్యాడ్ చేయాలని చూస్తే మాత్రం ఆ హీరోల ఇమేజ్ కే బ్యాడ్ జరుగుతుందనే విషయం ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి మన హీరోల మధ్య ఎలాంటి ఇగోలు లేకుండా వాళ్ళు సినిమాలు కలిసి చేస్తున్నారు. అలాగే ఒకరి ఈవెంట్ లోకి మరొకరు వచ్చి సక్సెస్ లు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం మాత్రం ఎందుకు గొడవపడాలి అనే విషయాన్ని అభిమానులు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది…