Maruti Alto K10 : చిన్న ఫ్యామిలీకి తక్కువ ధరకు వచ్చే కారు ఇదే.. మంచి మైలేజ్ కూడా..

మారుతి కంపెనీకి ఉండే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే కార్లు మంచి ఫీచర్లతో పాటు లో బడ్జెట్ లో ఉండడం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కారుగా నిలుస్తున్న ఓ కారు గురించి తెలుసుకుందాం.

Written By: Chai Muchhata, Updated On : September 13, 2024 11:08 am

Maruti Alto K10

Follow us on

Maruti Alto K10 :  : కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ లో బడ్జెట్ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. అయితే ఇప్పుడు కార్ల కంపెనీలు చాలా వరకు అవతరించాయి. దీంతో వీటి మధ్య పోటీ ఏర్పడి కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో వినియోగదారులను ఆకర్షించడానికి లో బడ్జెట్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఎన్ని కార్ల కంపెనీలు మార్కెట్లోకి వచ్చినా.. మారుతి కంపెనీకి ఉండే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే కార్లు మంచి ఫీచర్లతో పాటు లో బడ్జెట్ లో ఉండడం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కారుగా నిలుస్తున్న ఓ కారు గురించి తెలుసుకుందాం..

మారుతి అనగానే లో బడ్జెట్ కారు ఉంటుందని చాలా మంది అభిప్రాయం. అందువల్ల చిన్న ఫ్యామిలీ వారు కాను కొనాలని చూస్తే ముందుగా మారుతి సుజుకీ వైపు చూస్తారు. వారికి అనుగుణంగానే ఈ కంపెనీ తక్కువ ధరలో మంచి కారును అందుబాటులో ఉంచింది. అదే ఆల్టో కే 10. ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. కానీ దీని ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ కారు ఫీచర్స్ ను చూసి షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రూపుదిద్దుకున్న ఆల్టో కే 10 గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మారి ఆ కారు ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?

మారుతి ఆల్టో కే 10 పెట్రోల్ ఇంజిన్ తో పాటు CNG ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్న ఈ కారులో 49 బీహెచ్ పీ పవర్, 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ పై 5 స్పీడ్ మాన్యువల్, ఏజీఎస్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ పై 24.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. CNG మోడల్ లో 33.85 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఆల్టోకే 10 చిన్న కారు అయినా ఇందలో సేప్టీ ఫీచర్లు బాగానే ఉన్నాయి. ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం సీటు బెల్టులు ఉన్నాయి. అలాగే ఇవి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి. వీటితో పాటు ఈబీడీ సౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి.

ఈ కారులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 5గురు ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చు. బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. యువత, ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణించేందుకు అనుగుణంగా ఉంటుంది. అలాగే మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్, డ్రమ్ బ్రేకులు ఉంటాయి. చిన్న ఫ్యామిలీ కారు కొనాలని చూస్తే లో బడ్జెట్ లో ఈ కారు అందుబాటులో ఉంది. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 3.99 లక్షలుగా ఉంది.