అయితే తాజాగా ‘సలార్’ టీం నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఈ సినిమాలో జ్యోతిక నటించట్లేదట. ఇక ఫస్ట్ లుక్ తోనే ‘సలార్’కి నేషనల్ రేంజ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే ఈ సినిమాకు సంబంధించి తర్వాత అప్ డేట్ ఎప్పుడు వస్తోందా ? అని పాన్ ఇండియా లెవల్ లో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఎలాగూ మేకర్స్ ఏప్రిల్ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మరి కరోనా ఎప్పటికీ తగ్గుతుందో, మళ్ళీ ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేం కాబట్టి, అనుకున్న డేట్ కి ఈ సినిమాని రిలీజ్ చేయకపోవచ్చు.
ఇక ‘సలార్’లో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్’తో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాని అంతకుమించిన భారీ విజువల్స్ తో తీస్తున్నాడట. అందుకే ఈ సినిమాకి రెట్టింపు అంచనాలు ఉన్నాయి.