‘చిన్నారి పెళ్లి కూతురు’ పెళ్లి చేసుకోబోతుంది అంటూ అవికా గోర్ గురించి ఇప్పటికే చాల పుకార్లు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ ఆ మధ్య అవికా గోర్ కూడా ఇతనే నా కాబోయే భర్త అంటూ మిలింద్ అనే వ్యక్తిని సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి పరిచయం చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టింది. మళ్ళీ ఆ తరువాత పెళ్లి గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.
అయితే, తాజాగా అవికా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. మిలింద్ తో మీ పెళ్లి ఎప్పుడు అని ఓ నెటిజన్ అడిగితే.. అవికా సమాధానం చెబుతూ… ‘ఇప్పుడే కాదు, నిజానికి ఇప్పటి వరకు మా పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఒకటి మాత్రం చెప్పగలను, మా పెళ్లి ఈ ఏడాది ఉండదు’ అంటూ స్పష్టం చేసింది. ఏది ఏమైనా అవికా గోర్, మిలింద్ ప్రేమలో పడిన తర్వాతే, కష్టపడి లావు కూడా తగ్గింది, అలాగే మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవ్వడానికి చాల ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ స్లిమ్ గా మారి సరికొత్తగా కనిపిస్తోంది. ఇక మధ్యమధ్యలో మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అసలు ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’ లాంటి వరుస సక్సెస్ లు వచ్చాక, అవికా తన కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు. వచ్చిన సినిమాలను వదులుకొని, చేసిన ఆ కొన్ని సినిమాల మేకర్స్ ను కూడా టైంకు సరిగ్గా రాకుండా బాగా ఇబ్బంది పెట్టింది.
ఆ తరువాత చాల గ్యాప్ తరువాత, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే సినిమాతో మంచి హిట్ వచ్చినా.. అవికా గోర్ కి మాత్రం తెలుగులో పెద్దగా సినిమాలు రాలేదు. అసలు ‘చిన్నారి పెళ్లికూతురు’ ధారావాహికతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ భామ, భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా నాలుగేళ్లలోనే ఆమె కెరీర్ గాడి తప్పింది.