పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ధరల పెరుగుదలతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. తన సంపాదనలో పెద్ద మొత్తం పెట్రోల్ కే ఖర్చవుతుందని వాపోతున్నాడు. బీజేపీ ప్రభుత్వం ధరలు తగ్గిస్తామని చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్ర్తస్తుతం అడ్డగోలుగా ధరలు పెంచడంతో మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరగకపోయినా మన దేశంలో మాత్రమే పెట్రో ధరలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో వంద రూపాయల మార్కు దాటింది. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన వివరాల ప్రకారం పెట్రోల్ లీటర్ కు 29 పైసలు, డీజిల్ లీటర్ కు 19 పైసలు మేర పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ కు రూ.93.04, డీజిల్ 83.01 పైసలకు చేరింది. ముంబైలో త్వరలో వంద రూపాయలు దాటుతుందని తెలుస్తోంది.
పెట్రో ధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. ప్రతి రోజు పెరగడంతో భారం ఎక్కువవుతోంది. చెన్నైలో పెట్రోల్ రూ.94.71, డీజిల్ ధర ర ూ.88.62, కోల్ కతలో పెట్రోల్ ధర రూ. 93.11, డీజిల్ ధర రూ. 86.64 పలుకుతోంది. బెంగుళూరులో పెట్రోల్ 96.14, పుణేలో 98.77, డీజిల్98.77, డీజిల్ 88.96, పాట్నాలో 95.23, డీజిల్ 89.05, చండీగఢ్ లో పెట్రోల్ 89.31, డీజిల్ 88.89, లక్నోలో 90.72, డీజిల్ 84.18, భపాల్ లో 101 మార్కు దాటింది. ఇదే తొలిసారి హైదరాబాద్ లో పెట్రోల్ ధర 96.50, డీజిల్ 91.04, నొయిడాలో పెట్రోల్ 90.66, డీజిల్ 83.97, గుర్గావ్ లో పెట్రోల్ 90.73, డీజిల్ 84.09గా నమోదైంది.
క్రూడాయిల్ ధరలు తగ్గినా..
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా పెట్రో ధరలు పెరిగిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసమే పెట్రో ధరలు నిరంతరం పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో సామాన్యుడు బలవుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కుదేలవుతున్నాడు. ట్రెండ్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ బ్యారెల్ ఒక్కంటికి 67.63 డాలర్లు పలికింది. 1.08 డాలర్ల మేర తగ్గింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ వద్ద కూడా క్రూడాయిల్ ఫ్యూచర్ ట్రేకింగ్ లో క్షీణత నెలకొంది. 1.5 డాలర్ల మేర తగ్గి 64.44 వద్ద నిలిచింది. భారత్, తైవాన్, వియత్నాం, థాయిలాండ్ వంటి ఆసియా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రతతో క్రూడాయిల్ ధర భారీగా తగ్గినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వ స్వార్థం కోసం..
ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం పెట్రో ధరలు పెరిగేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో ప్రజల అవసరాలను ఎవరు గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో నిరంతరం పెట్రో ధరల పెరుగుదలపై ఎవరు పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినా మన దేశంలో పెరగడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పెట్రో ధరల పెరుగుదలపై దృష్టి పెట్టి తగ్గించేందుకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి.