https://oktelugu.com/

Junior NTR : కేరళలో జూనియర్ ఎన్టీఆర్ రహస్య పూజలు.. అసలు ఏమి జరుగుతోంది..? త్వరలోనే సంచలన ప్రకటన!

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అర్థం రాత్రి నుండే షోస్ ప్రారంభిస్తే మొదటి రోజు 50 కోట్ల రూపాయిల షేర్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2024 / 09:59 PM IST

    Junior NTR's secret pooja in Kerala

    Follow us on

    Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోకి సంబంధించి ఏ చిన్న వార్త బయటకి వచ్చిన సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తారు. ఆయనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. ఒక్కోసారి అభిమానుల ప్రేమని చూసి ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం అనేకసార్లు జరిగింది. ఇది ఇలా ఉండగా నేడు ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. గుడి బయట తన తల్లితో కలిసి దిగిన ఫోటోని చూసి, ఏదైనా విశేషం ఉందా?, అకస్మాత్తుగా గుడికి వెళ్లి పూజలు చేయించడం ఏమిటి?, వచ్చే నెలలో దేవర చిత్రం విడుదల కాబోతుంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని పూజలు చేయించడానికి వెళ్లాడా?, లేకపోతే రాజకీయ అరంగేట్రం కోసం ముందుగా పూజలు చేయిస్తున్నాడా?, ఇలా ఒక్కటా రెండా ఎన్నో సందేహాలు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తలెత్తాయి.

    కానీ కాసేపటి క్రితమే ఎన్టీఆర్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ మా అమ్మకి ఆమె స్వగ్రామమైన కుందాపురం కి నన్ను తీసుకొచ్చి ఉడిపి శ్రీ కృష్ణ మఠంలో దర్శనం చేయించాలి అనే కోరిక ఉండేది. ఆ కోరిక నేటితో నెరవేరింది. సెప్టెంబర్ 2 న మా అమ్మగారి పుట్టినరోజు. ఆ రోజుకి ముందే మా అమ్మని ఈ మఠం కి తీసుకొచ్చి శ్రీ కృష్ణుని దర్శనం చేయించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నాకు ఈ దర్శన భాగ్యం కలిగించేందుకు సహాయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి, స్నేహితుడు రిషబ్ శెట్టి కి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.వీళ్ళ కారణం గా ఈరోజు నా జీవితంలో గుర్తించుకోదగిన మధుర జ్ఞాపకంగా మిగిలింది’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ వచ్చే నెల 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలకు, టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలలు ఇంకా 27 రోజుల సమయం ఉన్నప్పటికీ , అభిమానులు ఇప్పటి నుండే సందడి మొదలు పెట్టేసారు.

    ఓవర్సీస్ లోని పలు ప్రాంతాలలో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. నార్త్ అమెరికా లో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, అప్పుడే లక్ష డాలర్ల గ్రాస్ మార్కుని దాటేసింది. ఊపు చూస్తుంటే ఈ చిత్రం కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్స్ నుండే మూడు మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టేలాగా అనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అర్థం రాత్రి నుండే షోస్ ప్రారంభిస్తే మొదటి రోజు 50 కోట్ల రూపాయిల షేర్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి.