https://oktelugu.com/

Champions Trophy : మా దగ్గర భద్రత లేదు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు రావద్దు.. భారత్ ఆటగాళ్లకు పాక్ మాజీ క్రికెటర్ హెచ్చరిక..

ఇటీవల ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బ్లూ ప్రింట్ అందించింది. కరాచీ, గడాఫీ, రావల్పిండి మైదానాలను ఛాంపియన్స్ ట్రోఫీ కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగా 12.80 పాకిస్తాన్ బిలియన్ రూపాయలను ఖర్చు చేయనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2024 / 10:03 PM IST

    Do not come to play Champions Trophy.. Former Pakistani cricketer Danish Kaneria warns Indian players

    Follow us on

    Champions Trophy : వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల నుంచి పాకిస్తాన్ దేశంలో ఐసీసీ ఆధ్వర్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఘనమైన ఆతిథ్యం ఇస్తామని గొప్పలు పోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ రూపొందించి ఐసీసీకి సమర్పించింది. ఈ షెడ్యూల్లో భారత్ ఆడే మ్యాచ్ లను కూడా పాకిస్తాన్ పొందుపరిచింది.

    చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని ఐసీసీకి ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియా పాకిస్తాన్ వెళ్ళదని బీసీసీఐ ఐసీసీకి ఎప్పుడో చెప్పేసింది. మరోవైపు భారత్ తమ దేశానికి రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి విన్నవిస్తోంది. ఈ తరుణంలోనే ఐసీసీకి జై షా చైర్మన్ కావడంతో పాకిస్తాన్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగానే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఒక్కసారిగా అంచనాన వ్యాఖ్యలు చేశాడు..” టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ రావద్దు. దుబాయ్ వేదికగా హైబ్రిడ్ విధానంలో భారత్ ఆడే మ్యాచ్ లు నిర్వహించాలి.. మా దేశంలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం అనేది కుదరదు. ఇది మా దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా చోటు చేసుకున్న ఆందోళనకరమైన పరిణామం. ఇక్కడ పరిస్థితి మారదు. వారి అవకాశం కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో భారత జట్టు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ రావద్దు. పాకిస్తాన్ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలి. అదేవిధంగా ఆలోచన చేస్తుందని నేను భావిస్తున్నాను. ఆటగాళ్ల భద్రత అనేది ముందుగా ముఖ్యం. గౌరవానికి తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని” కనేరియా వ్యాఖ్యానించాడు.

    ” ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బిసిసిఐ ఆలోచన చాలా గొప్పగా ఉంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. కొన్ని దేశాలకు ఇది ఇబ్బందిగా అనిపించినప్పటికీ బీసీసీఐ ఆలోచనను గౌరవించాలి. ఛాంపియన్ ట్రోఫీ హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలనే బీసీసీఐ డిమాండ్ సరైనది. ఇదే విధానంలో టోర్నీ జరుగుతుందని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. దేశంలో భద్రతను పెంచే విషయంపై దృష్టి సారించాలి. అది నెరవేరనప్పుడు భారత్ లాంటి జట్టు పాకిస్తాన్ లో ఎట్టి పరిస్థితుల్లో పర్యటించదు.. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించకుండా.. భారత్ పాకిస్తాన్లో ఆడాలి అని డిమాండ్ చేయడం సరికాదని” కనేరియా వ్యాఖ్యానించాడు. ఇక షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని ఇటీవల ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బ్లూ ప్రింట్ అందించింది. కరాచీ, గడాఫీ, రావల్పిండి మైదానాలను ఛాంపియన్స్ ట్రోఫీ కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగా 12.80 పాకిస్తాన్ బిలియన్ రూపాయలను ఖర్చు చేయనుంది.