https://oktelugu.com/

NTR Brother-in-law : గ్రాండ్ గా జరిగిన ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’ నిశ్చితార్థం..పెళ్లి కూతురు ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

నెల్లూరు జిల్లాకు చెందిన శివాని ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కుటుంబానికి దగ్గర బంధువులట. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 09:40 PM IST

    Nitin Narne Engagement

    Follow us on

    NTR Brother-in-law :  జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, లక్ష్మి ప్రణీతి సోదరుడు నితిన్ నార్నే కి నేడు హైదరాబాద్ లో శివాని అనే అమ్మాయితో ఇరు కుటుంబాల పెద్దల సమక్ష్యంలో నిశ్చితార్థం జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన శివాని ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కుటుంబానికి దగ్గర బంధువులట. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, విక్టరీ వెంకటేష్ కుటుంబంతో పాటు నితిన్ కి ఇండస్ట్రీ లో క్లోజ్ గా ఉండే కొంతమంది యంగ్ హీరోలు కూడా ఈ నిశ్చితార్ధ వేడుకలో పాలుపంచుకున్నట్టు తెలుస్తుంది. అలాగే నితిన్ తండ్రి రాజకీయ నాయకుడు అవ్వడం తో, పలువురు ముఖ్య రాజకీయ నేతలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారట. ఈ సందర్భంగా నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి వేడుక వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది.

    ఇది ఇలా ఉండగా నార్నే నితిన్ ఎన్టీఆర్ బావమరిదిగా ‘మ్యాడ్’ అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నితిన్ కి కూడా మంచి నటుడిగా తొలిసినిమా తోనే పేరొచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన హీరోగా నటించిన రెండవ సినిమా ‘ఆయ్’ కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆరంభంలోనే యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ హిట్టు మీద హిట్టు కొట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకునే దిశగా నార్నే నితిన్ అడుగులు వేస్తున్నాడు. చూసేందుకు బాగుంటాడు, నటన బాగుంది, కామెడీ టైమింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని బాగానే ఉన్నాయి. స్క్రిప్ట్ సెలక్షన్ కూడా అదిరిపోతోంది, కాబట్టి కచ్చితంగా నితిన్ భవిష్యత్తులో పెద్ద హీరో రేంజ్ కి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇతనికి ఫుల్ సపోర్టు ఇస్తున్నారు.

    ప్రస్తుతం నార్నే నితిన్ ‘మ్యాడ్’ సీక్వెల్ లో హీరోగా నటిస్తున్నాడు. మ్యాడ్ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రారంభ స్థాయి నుండే భారీ గా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటే నితిన్ ఇండస్ట్రీ లో మరో మెట్టు పైకి ఎక్కినట్టే. ఈ చిత్రంతో పాటుగా ఆయన ‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ విగ్నేష్ తో ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి టీజర్ విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. పెళ్లి తర్వాత ఈమధ్య కుర్ర హీరోల కెరీర్స్ పీక్ రేంజ్ కి వెళ్తున్నాయి. ఉదాహరణకి రీసెంట్ గా కిరణ్ సబ్బవరం పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత ఆయన నుండి విడుదలైన ‘క’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో నార్నే నితిన్ కెరీర్ కూడా అలాగే ఉంటుందేమో చూద్దాం.