Lucky Bhaskar in OTT : ఈ దీపావళి కానుకగా విడుదలైన చిత్రాలలో ఆడియన్స్, క్రిటిక్స్ నుండి అద్భుతమైన పాజిటివ్ రివ్యూస్ ని దక్కించుకున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. ‘సీతారామం’ చిత్రం తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగు లో కథానాయకుడిగా నటించిన మూడవ సినిమా ఇది. అంతకు ముందు ఆయన ‘మహానటి’, ‘సీతారామం’ వంటి చిత్రాల్లో నటించాడు. ఈ రెండు కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయో మన అందరికీ తెలిసిందే. తెలుగు ఆడియన్స్ కి, ముఖ్యంగా యూత్ కి దుల్కర్ సల్మాన్ బాగా దగ్గరయ్యాడు. అమ్మాయిలలో కూడా ఈయన ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఒక మలయాళం హీరో మన ఇండస్ట్రీ కి వచ్చి హిట్టు మీద హిట్టు కొడుతూ ఇంత క్రేజ్ ని సంపాదించుకోవడం కేవలం దుల్కర్ విషయంలోనే జరిగింది. ఇక ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ కి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురుస్తుంది.
కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. A సెంటర్స్ లో ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రన్ ఉండే అవకాశం ఉండడంతో, కచ్చితంగా ఈ చిత్రానికి ‘సీత రామం’ రేంజ్ లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే కచ్చితంగా ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి. నాల్గవ రోజు కూడా ఈ సినిమాకి 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. మొదటి వారంలో 60 కోట్ల రూపాయలకు దగ్గరగా గ్రాస్ వస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మన టాలీవుడ్ లో ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్న మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ స్థాయి వసూళ్లను చూడలేదు, అలాంటిది పక్క ఇండస్ట్రీ నుండి వచ్చిన దుల్కర్ సల్మాన్ చూస్తున్నాడంటే మన ఆడియన్స్ మంచి సినిమాలను ఎలా ఆదరిస్తారో మరోసారి అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. వాళ్ళతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారం లో తెలుగు, మలయాళం తో పాటుగా హిందీ, తమిళం, కన్నడ లో కూడా విడుదల చేయనున్నారు. నాలుగు వారాలు తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకునే అవకాశం నిర్మాతలు ఇవ్వడంతో 25 కోట్ల రూపాయిలు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాతలకు చెల్లించడానికి సుముఖత చూపించినట్టు తెలుస్తుంది. ఒకవేళ థియేట్రికల్ రన్ అప్పటికి ముగియకపోతే నిర్మాతలు రిక్వెస్ట్ చేసుకొని కొన్ని రోజులు ఓటీటీ విడుదలని వాయిదా వేయొచ్చు, కానీ ముందు అనుకున్న 25 కోట్ల రూపాయిల డీల్ కంటే తక్కువకి అమ్మాల్సి ఉంటుంది. మరి ఈ చిత్రం లాంగ్ రన్ ఎలా ఉండబోతుందో చూడాలి.