Junior NTR and Balayya Baba : నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలని తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి తారక రామారావు గారి తర్వాత బాలయ్య బాబు (Balayya Babu) స్టార్ హీరోగా వెలుగొందగ ఇక మూడోవ తరం నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రేస్ లో నందమూరి ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళుతున్న హీరో కూడా జూనియర్ ఎన్టీఆరే కావడం విశేషం. గత సంవత్సరం ఆయన దేవర (Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. తద్వారా ఇప్పుడు రాబోతున్న సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే బాలయ్య మాత్రం వరుసగా నాలుగు సూపర్ సక్సెస్ లను సాధించి ప్రస్తుతం 5 వ విజయం కోసం అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక బాలయ్య బాబు లాంటి సీనియర్ హీరో ఈ ఏజ్ లో కూడా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధించాలని చూస్తూ ఉండటం విశేషం. ఇక ఈ క్రమంలోనే బాలయ్య బాబు ఎన్టీఆర్ మధ్య గత కొన్ని రోజుల నుంచి మాటలైతే లేవు. ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఆ ఫ్యామిలీలో జరిగే ఏ ఫంక్షన్ కి కూడా అటెండ్ అవ్వడం లేదు. వీళ్ళ మధ్య జరిగిన గొడవలేంటి? ఎందుకని ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు అనే కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
Also Read : ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్
ఇక వాటన్నింటిని పక్కన పెడితే ప్రస్తుతం ఎన్టీఆర్ కంటే బాలయ్య బాబు గ్రేట్ అంటూ కొంతమంది నందమూరి అభిమానులు సైతం కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం. ఎందుకంటే బాలయ్య బాబు తన ఎంటైర్ కెరియర్ లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను సాధించాడు.
కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ ను కూడా దక్కించుకోలేకపోయాడు. కారణం ఏదైనా కూడా బాలయ్య బాబును బీట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ముందుకు దూసుకెళ్లాడు అని అనుకుంటున్నారు కానీ ఒకప్పటి బాలయ్య బాబును బీచ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు అంటూ బాలయ్య అభిమానులు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీలో ఇలాంటి చీలికలు రావడం బాలయ్య బాబు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తీవ్రమైన ఫైటింగ్ జరగడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి… మరి ఇకమీదటైనా వీళ్ళందరూ కలిసిపోయి మళ్లీ నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!