Rajamouli : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని… కానీ రాజమౌళి చేసిన 12 సినిమాలకు 12 సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలిపాడు అంటే ఆయనకి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. ప్రతి హీరోకి ఆయన సూపర్ సక్సెస్ లను సాధించి పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి(Rajamouli)కి చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. ఆయన నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పిస్తూ ఉండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వస్తున్న సినిమాతో ఆయన చేయబోతున్న ప్రయోగం సక్సెస్ ఫుల్ గా నిలుస్తుందని తద్వారా తెలుగు సినిమా స్థాయి అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందనే నమ్మకంతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఆయనకు సపోర్టుగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు అభిమాని మీద ఉంది. అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా ప్రేక్షకులందరు రాజమౌళిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరమైతే ఆసన్నమైందనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సినిమాలన్ని సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించినప్పటికి ఆయన చేసిన అన్ని సినిమాల్లో కొన్ని సినిమాలకు మాత్రం ఎక్కువ ప్రేక్షకాదరణ అయితే దక్కుతుంది.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!
ముఖ్యంగా రవితేజ (Raviteja) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) సినిమాని చాలామంది జనాలు ఇష్టపడుతూ ఉంటారు. ఆ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చిన కూడా చూస్తూ కూర్చుండిపోయే ప్రేక్షకులు చాలామంది ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వచ్చిన మగధీర (Magadheera) సినిమాని కూడా ఒకటికి పదిసార్లు చూసే జనాలు ఉన్నారు. కాబట్టి ఈ రెండు సినిమాలు రాజమౌళి కెరియర్ లోనే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలుగా చెప్పవచ్చు. ఇక బాహుబలి లాంటి ప్రెస్టేజియస్ సినిమాలు సైతం అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినప్పటికి ఆ సినిమాల కంటే ఈ రెండు సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండటం విశేషం…
ఇక ఎంటైర్ రాజమౌళి కెరియర్ లో ఎలాంటి సినిమాలు చేస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా తను అనుకున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అందులో ఎవరెవరిని ఆర్టిస్టులుగా తీసుకుంటాడు అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?