Pushpa 2 : ఇండియాలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో ఇప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకుంటారా తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కనంత క్రేజీ ను సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఈ సినిమా వల్ల తన క్రేజ్ ను విస్తరింపజేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవడం లో కీలక పాత్ర వహించారనే చెప్పాలి. ఇక పుష్ప 2 సినిమాకి ఘోరమైన అవమానం అయితే జరిగింది. అది ఏంటి అంటే ఈ సినిమాని మొదటిసారి టెలివిజన్ లో టెలికాస్ట్ చేసినప్పుడు కేవలం 12.5 టిఆర్పి రేటింగ్ రావడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం… ఇంతకుముందు ఆయన చేసిన ‘అలా వైకుంఠపురంలో’ (Ala Vaikuntapuram lo) సినిమాకి 22.5 రేటింగ్ రాగా పుష్ప (Pushpa) మొదటి పార్టీకి 25.1 రేటింగ్ అయితే వచ్చింది.
Also Read : ‘పుష్ప 2’ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇన్నాళ్లకు విషయం బయటపెట్టిన థమన్ ?
మరి ఈ రేటింగ్ ని కాదని ఇప్పుడు రేటింగ్ రావడానికి గల కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ తో పాటు ఈ సినిమా మీద అందరికి సరైన నమ్మకమైతే లేకుండా పోయింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ మృతి చెందింది అనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.
అందువల్లే ఈ సినిమా మీద కొంత వరకు నెగెటివిటీ అయితే పెరిగింది. ఇక ఇప్పుడు ఆ కారణం వల్ల ఈ సినిమాని చూడడానికి కొంతమంది ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
మొత్తానికైతే పుష్ప 2 సినిమా టిఆర్పి రేటింగ్ అనేది అల్లు అర్జున్ తో పాటు అతని అభిమానులను సైతం తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పవచ్చు… మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక రాబోయే సినిమాలతో తమ ప్రేక్షకులను అభిమానులను ఎలా ఇంప్రెస్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
Also Read : పుష్ప 2′ మొత్తం మాయేనా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్..సంచలనం రేపుతున్న వీడియో!