Jr NTR : ఆర్ ఆర్ ఆర్ విడుదల అనంతరం ఎన్టీఆర్ కి విరామం దొరికింది. ఇటీవల కొంచెం బిజీ అయ్యారు. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదల సందర్భంగా రాజమౌళి, రామ్ చరణ్ తో పాటు అక్కడకు వెళ్లారు. అయితే ఇది ఫ్యామిలీ ట్రిప్ కూడా. సతీసమేతంగా జపాన్ వెళ్లడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రొమోషన్స్ ముగిశాక జపాన్ దేశంలో భార్య, పిల్లలతో విహరించారు. ఇక ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో భారీ విజయం సాధించింది. అనేక రికార్డులు బ్రేక్ చేసి టాప్ పొజిషన్ పై కన్నేసింది. బాహుబలి 2 ని బీట్ చేసి రజనీకాంత్ ముత్తుని ఢీ కొట్టేందుకు సిద్ధమైంది.

జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ కి యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాటు దర్శకుడు రాజమౌళి పలు అంతర్జాతీయ అవార్డ్స్ కొల్లగొడుతున్నారు. గ్లోబల్ సినిమా వేదికపై ఆర్ ఆర్ ఆర్ విశేష గుర్తింపు తెచ్చుకుంటుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ కి కూడా ఓ గౌరవం దక్కింది. ఐఎండీబీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. ఆయనకు టాప్ టెన్ లో చోటు దక్కింది.
ఈ జోష్ లో ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ షూట్లో పాల్గొననున్నారు. కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ పని చేస్తున్నారు. మాస్ బీట్స్ కి పెట్టింది పేరైన అనిరుధ్ సాంగ్స్ కి ఎన్టీఆర్ దుమ్మురేపే డాన్సులు ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కాగా షూట్ మొదలయ్యే లోపు ఎన్టీఆర్ కి లాంగ్ వెకేషన్ ప్లాన్ చేశారు.

ఆయన కుటుంబంతో పాటు అమెరికా ట్రిప్ కి వెళుతున్నారు. ఎన్టీఆర్ పర్సనల్ ట్రిప్ నెలరోజుల పాటు సాగనుందట. ఈ సమయంలో ఆయన అభిమానులకు, సినిమా ప్రముఖులకు అందుబాటులో ఉండరని సమాచారం. ఇక అమెరికాకు పయనమవుతున్న ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఆయన బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఫుల్ స్టైలిష్ గా ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ తో పాటు నడుస్తున్నారు. కొరటాల మూవీ అనంతరం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు.