Junior NTR Abroad: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతి నిమిషం సినిమానే శ్వాసగా, ధ్యాసగా బ్రతకాలి…అలాంటి వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఎవరైతే సినిమా కోసం కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటారో వాళ్లే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదుగుతారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ప్రస్తుతం భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే ‘యంగ్ టైగర్’ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తాతకు తగ్గ మనవడిగా ఎదిగాడు. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం వచ్చిన ‘వార్ 2’ సినిమా ఎన్టీఆర్ కి ఏ మాత్రం ఇమేజ్ ను సంపాదించి పెట్టలేదు. తన మార్కెట్ ను కూడా చాలా వరకు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది…
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
బాలీవుడ్ ప్రేక్షకులకు కొంతవరకు దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడినప్పటికి గత సినిమాలతో పోలిస్తే వార్ 2 సినిమా చాలావరకు తేలిపోయిందనే చెప్పాలి. ‘వార్ 2’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కొంతవరకు దగ్గరయ్యాడు…ఇక దాంతో ఇప్పుడు డ్రాగన్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
దానికి తోడుగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఇంతకు ముందెప్పుడు లేనంత స్లిమ్ గా మారిపోయాడు. ఒక రకంగా ఎన్టీఆర్ ఆ లుక్ లో అందంగా కనిపించడం లేదు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ ని ఆ లుక్ లోనే చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ లుక్ లో స్క్రీన్ మీద అద్భుతాన్ని చేయడానికి ఎన్టీఆర్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల వీళ్ళ సినిమా కోసం బీ,సీ సెంటర్లోని జనాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ నవంబర్ మూడోవ వారం నుంచి యూరప్ లో జరగబోతుందట…
ఇక కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కి గాయాలైన విషయం మనకు తెలిసిందే. దాంతో కొద్దిరోజుల పాటు ఆయన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు కోలుకున్నాడు కాబట్టి శరవేగంగా షూటింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు… ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాలను క్రియేట్ చేయబోతోందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…