Champion Teaser Talk: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్… ఆయన సినిమాలు అప్పట్లో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించాయి. ప్రస్తుతం ఆయన సినిమాలకు మార్కెట్ లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తన కొడుకు అయిన రోషన్ సైతం గత ఐదు సంవత్సరాల క్రితమే ‘నిర్మల కాన్వెంట్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాని తర్వాత ‘పెళ్లి సందడి’ అనే సినిమా చేశాడు. అది కూడా ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అయినప్పటికి రోషన్ చూడడానికి లుక్స్ పరంగా అద్భుతంగా ఉండడంతో అతనికి వైజయంతి మూవీస్ నుంచి ఆఫర్ వచ్చింది.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ప్రస్తుతం ‘చాంపియన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక మూవీకి సంబంధించిన టీజర్ ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సినిమా యొక్క వరల్డ్ ని పరిచయం చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది…
లవ్ కం యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం రోషన్ చాలా కష్టపడినట్టుగా తెలుస్తోంది. దానికోసం హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నాడు. మొత్తానికైతే ఇందులో ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు టీజర్ ని చాలా ఇంట్రెస్ట్ గా మలిచారు…హీరో తన ప్రేమను గెలిపించుకోవడానికి తను ఎలా పోరాటం చేశాడు. ఫైనల్ గా ఆయన ఎలా ఛాంపియన్ గా మారాడు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తోంది.
ఇక ఇందులో ఆయన ఎలాంటి నటనను కనబరిచాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో పోటీ పడగలిగే కెపాసిటీ తనకు ఉందా? లేదా అనేది ఈ సినిమా డిసైడ్ చేస్తుందని పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒకరకంగా ఆయన చేస్తున్న క్యారెక్టర్ చాలా హెవీగా ఉంది. మరి ఆ క్యారెక్టర్ యొక్క వెయిట్ తను మూయగలడా లేదా అనే విషయంలో కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది…