Janhvi Kapoor Peddi Movie First Look: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సన దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంతటి అంచనాలు క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారణం, రామ్ చరణ్ రూరల్ బ్యాక్ డ్రాప్ జానర్ లో సినిమా చేయడమే. గతంలో ఇదే బ్యాక్ డ్రాప్ లో ఆయన రంగస్థలం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చేసాడు. కమర్షియల్ గా ఇది రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, నటుడిగా ఆయన్ని శిఖరాగ్ర స్థాయిలో కూర్చోబెట్టింది. అలాంటి జానర్ లో మళ్లీ చేస్తున్నాడు కాబట్టే ఇంతటి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే గ్లింప్స్ వీడియో కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్(Jhanvi Kapoor) కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఇందులో ఆమె క్యారక్టర్ ని ‘అచ్చియమ్మ’ గా పరిచయం చేశారు. చూస్తుంటే ఆమె మొదటి తెలుగు చిత్రం ‘దేవర’ లోని తంగం గెటప్ కి, పెద్ది గెటప్ కి అసలు తేడానే కనిపించడం లేదు. రెండు లుక్స్ ఒకేలాగా ఉన్నాయి కానీ, పెద్ది లుక్ కాస్త మాస్ గా అనిపిస్తుంది. ఇందులో ఆమె సర్పంచ్ కూతురుగా నటిస్తుందని టాక్. దేవర చిత్రం లో ఆమెకు నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ దొరకలేదు. కానీ పెద్ది లో మాత్రం నటన కు ఫుల్ స్కోప్ ఉన్న క్యారక్టర్ దొరికిందట. పాత సినిమాల్లో పొగరుగా నగ్మా ఎలా నటించేదో గుర్తుంది కదా, ఆ తరహా లో ఈమె క్యారక్టర్ ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈమె ఎంత వరకు మెప్పించగలదో చూడాలి.
బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి నటిగా మంచి పేరుంది. కానీ అక్కడ సక్సెస్ మాత్రం దొరకలేదు. కానీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే ఈమె సక్సెస్ ని అందుకుంది. ఇప్పుడు పెద్ది తో ఆ సక్సెస్ ని మరింత ముందుకు తీసుకెళ్తుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలోని మొదటి పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. హీరోయిన్ ని టీజ్ చేస్తూ రామ్ చరణ్ అద్భుతంగా ఈ పాటలో డ్యాన్స్ వేసాడట. AR రెహ్మాన్ అందించిన బాణీ కూడా అదిరిపోయిందట. రామ్ చరణ్ గతం లో హీరోయిన్ ని టీజ్ చేస్తూ కనిపించింది చిరుత చిత్రం లోనే. ఆ పాట అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపింది. ఇప్పుడు కూడా అదే రేంజ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
#Achiyyamma #Peddi pic.twitter.com/tq9ajagvAx
— PEDDI (@PeddiMovieOffl) November 1, 2025