https://oktelugu.com/

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పాడు..నా బిడ్డని వదలము అంటున్నారు అంటూ అభిమాని తల్లి ఆవేదన!

నాలుగు నెలల క్రితం కౌశిక్ అనే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, తాను చనిపోయేలోపు ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం చూడాలని ఉంది అనే కోరికని బయటపెడుతూ ఒక వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 03:59 PM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR : నాలుగు నెలల క్రితం కౌశిక్ అనే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, తాను చనిపోయేలోపు ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం చూడాలని ఉంది అనే కోరికని బయటపెడుతూ ఒక వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు దీనిని తమ అభిమాన హీరో వరకు చేర్చేలా చేసారు. ఎన్టీఆర్ బెడ్ మీద ఉన్న కౌశిక్ తో వీడియో కాల్ ద్వారా మాట్లాడి, అతనికి ధైర్యం చెప్పి, ఆ అబ్బాయి చికిత్సకి కావాల్సిన ఖర్చు మొత్తాన్ని భరిస్తాను అని, ఏ అవసరం వచ్చినా తన మ్యానేజర్ కి ఫోన్ చేయాల్సిందిగా కౌశిక్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. అయితే నేడు కౌశిక్ తల్లి మీడియా తో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

    ముందుగా మీడియా రిపోర్టర్ ఆమెతో మాట్లాడుతూ ‘ఆరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీ అబ్బాయితో , మీతో వీడియో కాల్ లో మాట్లాడాడు కదా, మీరంతా ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటా అన్నాడు, అతని నుండి ఏమైనా ఆర్ధికసాయం అందిందా?’ అని అడగగా, దానికి ఆమె సమాధానం ఇస్తూ ‘జూనియర్ ఎన్టీఆర్ నుండి మాకు ఒక్క పైసా కూడా ఆర్ధిక సాయం అందలేదు. కానీ వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుండి విరాళంగా రెండున్నర లక్షల రూపాయిలు అందింది, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున CMRF నుండి 11 లక్షల రూపాయిలు వచ్చాయి, టీటీడీ వాళ్ళ నుండి కూడా 40 లక్షలు వచ్చింది. కానీ ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి హై నుండి చాలా లౌ అయిపోయింది. ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాడు. కీమో తెరఫీ చేయడం వల్ల గుండె,లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ చేరిపోయింది. దానిని డాక్టర్లు బాగు చేసారు, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాలంటే మరో 20 లక్షలు అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చే దాకా డిశ్చార్జ్ చెయ్యము అంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.

    ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుడు 20 లక్షలు సహాయం చేసేవాళ్ళు నాకు ఎవ్వరూ లేరు. ఎన్టీఆర్ గారి మ్యానేజర్ కి ఫోన్ చేసి కాస్త సహాయం చెయ్యమని అడిగితే, ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పారు. వాళ్ళు ఇప్పటికే చాలా సహాయం చేసారు సార్ అని చెప్పాను , కానీ ఆయన మాత్రం కుదరదు అనేశాడు’ అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియా లో కొంతమంది ఎన్టీఆర్ పై మండిపడుతున్నారు. సహాయం చేయలేనప్పుడు ఎందుకు అందరి ముందు మాట ఇచ్చావు అంటూ నిలదీస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనికి రియాక్ట్ అవుతూ, ఎన్టీఆర్ అన్నయ్య కి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా మానవతా దృక్పధంతో ఆ అబ్బాయికి ఆర్ధికసాయం అందేలా చేసాడు. ఆయన స్పందించడం వల్లే కదా కౌశిక్ వైద్యానికి అవసరమైన డబ్బులు సమకూరింది, ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఇలా మాట్లాడడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.