https://oktelugu.com/

Nagavamshi : చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు..కానీ అదే నిజం అంటూ ‘దేవర’ నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య, 'వాల్తేరు వీరయ్య' డైరెక్టర్ బాబీ తో 'డాకు మహారాజ్' అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 04:04 PM IST

    Nagavamshi

    Follow us on

    Nagavamshi : అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య, ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ తో ‘డాకు మహారాజ్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో తో పాటు, లిరికల్ వీడియో సాంగ్ ని కూడా ఇటీవలే విడుదల చేయగా, వాటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి నేడు ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రమోషనల్ ఈవెంట్స్ గురించి ముందుగా మాట్లాడుతూ ఒక ఈవెంట్ ని అమెరికా లో జనవరి 4వ తేదీన చేయబోతున్నామని, మరో ఈవెంట్ ని విజయవాడలో చేస్తామని చెప్పుకొచ్చాడు.

    సినిమా ఔట్పుట్ ఎలా వచ్చింది అని మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి నాగ వంశీ సమాధానం చెప్తూ ‘సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ బాబీ గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ అందరికీ తెలిసిందే. ‘డాకు మహారాజ్’ ని బాబీ ‘వాల్తేరు వీరయ్య’ కంటే అద్భుతంగా తీసాడు. ఇలా మాట్లాడినందుకు నన్ను చిరంజీవి గారి అభిమానులు తిట్టుకున్నా పర్వాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. గత ఏడాది విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి లోని కామెడీ టైమింగ్, సెంటిమెంట్ యాంగిల్ ని బయటకి తీసిన చిత్రమిది.

    అలా ఒక భారీ హిట్ తో మంచి ఫామ్ మీదున్న బాబీ, వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.కేవలం వీళ్లిద్దరు మాత్రమే కాలేదు, నిర్మాత నాగవంశీ కూడా వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఏడాది ప్రారంభం లో టిల్లు స్క్వేర్ చిత్రంతో భారీ హిట్ ని అందుకున్న నాగవంశీ, సెప్టెంబర్ నెలలో దేవర చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసి మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇలా మంచి సక్సెస్ ఊపులో ఉన్నటువంటి ఈ కాంబినేషన్ నుండి మరో భారీ బ్లాక్ బస్టర్ రాబోతుంది అంటూ అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు రాణిస్తుంది అనేది.