Junior NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సందర్భంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మన తెలుగు సినిమాల వైపే చూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మన దర్శకులు మంచి కథలను ఎంచుకొని సూపర్ హిట్ సినిమాలను చేయడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను కూడా సృష్టిస్తున్నారు. ‘బాహుబలి’ (Bahubali) సినిమాతో పాన్ ఇండియా ఆ సినిమాలకు తెరలేపిన రాజమౌళి(Rajamouli) ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆయన బాటలోనే నడుస్తున్న మన దర్శకులందరు మంచి సినిమాలను చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నారనే చెప్పాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఆయనకు భారీ సక్సెస్ ని సాధించే సినిమాలు మాత్రం రావడం లేదు.
Also Read : ఎన్టీఆర్ కి ఏమైంది..? ఎందుకిలా అయిపోయాడు..అవేమి లుక్స్ బాబోయ్ అంటున్న నెటిజెన్స్!
ఇప్పటివరకు వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఎన్టీఆర్ (NTR) పాన్ ఇండియా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు మాత్రం చేయలేకపోతున్నాడు. గత సంవత్సరంలో వచ్చిన ‘దేవర’ (Devara) సినిమా 500 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది తన తోటి హీరోలందరూ 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుంటే ఈయన మాత్రం 500 కోట్ల దగ్గర ఆగిపోతున్నాడు. ఇక పాన్ ఇండియాలో ఎన్టీఆర్ కంటే అల్లు అర్జున్ (Allu Arjun) కి భారీగా క్రేజీతో పెరిగింది.
పుష్ప 2 (Pushpa 2) సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన అల్లు అర్జున్ ఇక అదే ఊపులో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ కంటే తక్కువ మార్కెట్ ను కలిగి ఉన్న అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక పుష్ప సినిమాతో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాలతోనే ఆయన మార్కెట్ భారీగా పెరిగింది. ఇక ఎన్టీయార్ ను డామినేట్ చేసి ఆయన ముందంజలోకి వెళ్ళాడు.
మరి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా భారీ విజయాన్ని సాధించి ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలకి పోటీని ఇస్తూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే విధంగా ఎన్టీఆర్ ముందుకు దూసుకెళ్తే మాత్రం ఆయనకంటూ ఒక భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది…లేకపోతే మాత్రం మరోసారి ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయిపోయే పరిస్థితి రావచ్చు…
Also Read : జూనియర్ ఎన్టీఆర్ హైట్ పై రవిబాబు సెటైర్లు..అతనితో నేను నటించను అంటూ మొండిపట్టు..అసలు ఏమైందంటే!