Jabardast Rohini : జబర్దస్త్ వేదికగా ఫేమస్ అయిన రోహిణి కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఆమె పలు సీరియల్స్ లో నటించారు. కానీ ఎలాంటి ఫేమ్ రాలేదు. సీరియల్ నటులకు పారితోషికాలు తక్కువ. పైగా పెద్దగా పాపులారిటీ కూడా రాదు. దాంతో తెలివిగా జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. తన టాలెంట్ తో లేడీ కమెడియన్ హోదా తెచ్చుకుంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఏర్పర్చుకుని హాస్యం పండిస్తోంది. కాగా బిగ్ బాస్ సీజన్ 3లో రోహిణి కంటెస్ట్ చేసింది. పెద్దగా రాణించలేదు. నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యింది.
Also Read : మాజీ జబర్దస్త్ యాంకర్ తో హైపర్ ఆదికి ఎఫైర్? కొత్త అమ్మాయిలను ఇబ్బంది పెడతాడా? సౌమ్యరావు కీలక కామెంట్స్
గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 8లో ఆమెకు మరో ఛాన్స్ వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఐదుగురు మాజీ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా పంపారు. వారిలో రోహిణి ఒకరు. ఈసారి అనుభవం ఉపయోగించి సక్సెస్ అయ్యింది. కష్టపడి గేమ్ ఆడిన రోహిణి హౌస్లో తనను విమర్శించిన వారికి చెక్ పెట్టింది. 14వ వారం ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ అయ్యింది.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె ఓపెన్ అయ్యారు. టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె ఆవేదన చెందారు. ఓ నిర్మాత తన మేనేజర్ తో కమిట్మెంట్ ఇవ్వాలని అడిగించాడట. తనకు కమిట్మెంట్ అంటే ఏమిటో తెలియక.. సరే సర్, ఛాన్స్ ఇస్తే కష్టపడి కమిటెడ్ గా పని చేస్తాను.. అని సమాధానం చెప్పిందట. తీరా కమిట్మెంట్ మీనింగ్ తెలుసుకుని.. తనకు తెలిసిన అంకుల్ కి ఆ నిర్మాత ఇలా అడిగాడని చెప్పిందట. ఆయన ఫోన్ చేసి నిర్మాతను తిట్టాడట. నేను నిన్ను కమిట్మెంట్ అడిగానా? అని రోహిణిపై ఆ నిర్మాత ఎదురుదాడి చేశాడట.
మరో నిర్మాత జీ తెలుగులో నీకు ఏ సీరియల్ లో కావాలంటే ఆ సీరియల్ లో ఆఫర్ ఇప్పిస్తాను. కాకపోతే నువ్వు నాకు ఏమిస్తావ్ అని కమిట్మెంట్ అడిగాడట. ఆయన మీద సీరియస్ అయిన రోహిణి వచ్చేసిందట. తనకు ఎదురైన చేదు అనుభవాలను రోహిణి బయటపెట్టారు. ప్రస్తుతం స్టార్ యాంకర్స్ గా వెలుగొందుతున్న శ్రీముఖి, అనసూయలు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని, తమకు అనుభవం అయ్యిందని చెప్పిన సంగతి తెలిసిందే.