Jr Nayanthara: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జూనియర్ నయనతార..!

టిక్ టాక్ లో అషురెడ్డి సమంత డైలాగ్స్ తో డబ్స్మాష్ వీడియోలు చేసేది. దాంతో విపరీతంగా ఆమెకు ఫాలోవర్స్ ఏర్పడ్డారు. సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ పట్టేసింది.

Written By: S Reddy, Updated On : April 29, 2024 2:25 pm

Junior Nayanthara is shaking the social media

Follow us on

Jr Nayanthara: ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. కొందరిని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. సోషల్ మీడియా ప్రభావంతో స్టార్స్ పోలిన సామాన్యులు వెలుగులోకి వస్తున్నారు. దివంగత సౌందర్యను పోలిన ఓ అమ్మాయి వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆమె ముఖంలో చాలా వరకు సౌందర్య పోలికలు ఉన్నాయి. జూనియర్ సౌందర్యగా ఆ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయ్యింది. బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి జూనియర్ సమంత సోషల్ మీడియాలో పాప్యులర్ అయ్యింది.

టిక్ టాక్ లో అషురెడ్డి సమంత డైలాగ్స్ తో డబ్స్మాష్ వీడియోలు చేసేది. దాంతో విపరీతంగా ఆమెకు ఫాలోవర్స్ ఏర్పడ్డారు. సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ పట్టేసింది. అషురెడ్డిలో సమంత పోలికలు ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ ని పోలిన అమ్మాయి వెలుగులోకి వచ్చింది. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార వలె ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు సజినీ కృష్ణ.

సజినీకృష్ణ నయనతారకు చెందిన డైలాగ్స్, సాంగ్స్ ని ఇమిటేట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. అచ్చు నయనతారను ఆమె పోలి ఉన్న నేపథ్యంలో అవి కాస్తా వైరల్ గా మారాయి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నయనతార పోలికలతో పుట్టడం సజనీ కృష్ణ సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక సజనీ కృష్ణను ఇంస్టాగ్రామ్ లో 31 వేలకు పైగా ఫాలో అవుతున్నారు. అంతకంతకు సజనీ కృష్ణ ఫేమ్ పెరిగిపోతుంది.

భవిష్యత్ లో నయనతారకు డూప్ గా సజనీ కృష్ణ నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత దగ్గర పోలికలు సజినీ కృష్ణకు ఉన్నాయి. మరోవైపు నయనతార కెరీర్ పరిశీలిస్తే… గత ఏడాది జవాన్ మూవీతో భారీ హిట్ కొట్టింది. బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. నయనతార 2022లో దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు.