Homeఆంధ్రప్రదేశ్‌Hindutva in AP: ఏపీలో పెరిగిన హిందుత్వవాదం!

Hindutva in AP: ఏపీలో పెరిగిన హిందుత్వవాదం!

Hindutva in AP: ఏపీలో సెక్యులర్ భావజాలం ఎక్కువ. ఇక్కడ మతానికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండేది. అంతకుమించి మతం అనే మాట ఉండేది కాదు. వాస్తవానికి ఉమ్మడి ఏపీ మద్రాస్ ప్రెసిడెంట్ లో ఉండేది. అక్కడ ద్రవిడ భావజాలం ఎక్కువ. అందరూ సమానమే అన్న రీతిలో నడిచేది అక్కడి భావజాలం. అదే ఏపీలో కూడా విస్తరించింది. అందుకే వామపక్షాలకు మంచి ఆదరణ ఉండేది ఏపీలో. ఒకానొక దశలో వామపక్షాలు అధికారంలోకి వస్తాయి అనే పరిస్థితి వచ్చింది. దానికి కారణం సెక్యులరిజం. కుల భావన ఉండేది గాని.. మత భావన అనేది ఏపీలో మచ్చుకైనా కనిపించేది కాదు. ఆ కారణంతోనే హిందుత్వవాదంతో ముందుకు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏపీలో ఎదగలేదు.

* ఆ పరిణామాలతోనే..
అయితే గతంతో పోల్చితే ఏపీలో హిందుత్వవాదం పెరుగుతోంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అన్యమత ప్రచారం జోరుగా సాగింది. వైసిపి ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు సంబంధించి విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో విగ్రహాలను ధ్వంసం చేయడం.. రథాలను దగ్ధం చేయడం వంటివి జరిగాయి. అప్పటి ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అదే ఇతర మతాలకు సంబంధించిన వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో ఉండి పోయాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం హిందూ మతం పై విపరీతంగా ప్రభావం చూపింది. ఆపై హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెరిగాయి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.

* అటువంటి వారి చర్యలతో..
ఎప్పుడైతే హిందుత్వవాదం అనేది ప్రారంభం అయ్యిందో.. అప్పటినుంచి ఇతర మతాలను విపరీతంగా ప్రేమించి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారు తట్టుకోలేకపోయారు. వారు ఓపెన్ అయ్యారు. తాజాగా అరెస్టయిన జోసెఫ్ రావణ్ ఆకోవలోకి చెందిన వారే. హిందూ దేవతలతో పాటు దేవుళ్ళపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యక్తి అరెస్టును హిందుత్వవాదులు ఆహ్వానించారు. హిందూ సమాజం సైతం పోలరైజేషన్ అయ్యేలా కనిపిస్తోంది. రఘురామకృష్ణం రాజు సైతం హిందుత్వ వాదాన్ని బలంగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను టార్గెట్ చేసుకునే తీరులో మతవాదం కనిపిస్తోంది. అందుకే ఈసారి హిందుత్వ ఓటు ఏపీలో పోలరైజేషన్ అయ్యేలా ఉంది. గతంలో ఇటువంటి ప్రయత్నాలు బిజెపి చేసింది కానీ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రజల్లో భావోద్వేగం బయటపడుతోంది. మరి ఇది ఇటు దారితీస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version