Jayasudha calls only those two Heroes as brother
Jayasudha: ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన నటీమణులలో జయసుధ ఒకరు… సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంది.
ఇక 65 సంవత్సరాల వయసులో ఉన్న జయసుధ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించడంలో తనను మించిన నటీమణి లేదు. ఇక తను ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే సంపాదించుకుంది. ఆమె నటనలో వైవిధ్యాన్ని కనబరుస్తూ ఆమె యాక్టింగ్ చాలా సహజంగా ఉండడంతో ఆమె ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు…ఇక ఇదిలా ఉంటే ఆమె ఎంటైర్ కెరీయర్ లో చాలామంది హీరోలతో నటించి మెప్పించిన విషయం మనకు తెలిసిందే.. ఆమె ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఇద్దరిని మాత్రమే అన్నయ్య అని పిలుస్తుందట…
వాళ్ళు ఎవరంటే ఒకరు మురళీమోహన్ కాగా, మరొకరు మోహన్ బాబు..ఇక వీళ్ళిద్దరిని తను ఎప్పుడు అన్నయ్య అనే పిలుస్తుందట… ఇక ఈమె దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చే సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ బాగా పాపులారిటీని కూడా సంపాదించుకున్నారు. ఇక ముఖ్యంగా ఎవడు సినిమాలో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో కి అమ్మగా నటించి, గోవిందుడు అందరివాడేలే సినిమాలో నానమ్మ పాత్రలో నటించి మెప్పించడం అనేది నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక తను ఎలాంటి వైవిద్యమైన పాత్రనైన సరే పోషించడానికి రెడీగా ఉన్నానని ఎప్పటికప్పుడు దర్శకులకు గాని, ఆడియన్స్ కి గాని తను ఇంటిమేషన్ అయితే పంపిస్తుంది. అందువల్లే తనని ఏ పాత్రలో వాడుకున్నా కూడా తన ఆ పాత్రకి న్యాయం చేయగలుగుతుంది… ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…