Compliment: కొందరికి పొగడ్తలు అంటే చాలా ఇష్టం. కొందరికి పొగడటం అంటే అసలు నచ్చదు. ఇక తమ కింద పని చేసే వారిని పొగడటం కూడా ఇష్టం ఉండదు. కానీ పొగడ్తల వల్ల ఎనర్జీ వస్తుంది కొందరిలో. అయితే సుగ్రీవుడు కూడా హనుమంతుడిని పొగిడే వాడు కాదు అంటారు పండితులు. ఎప్పుడు హనుమంతుని దగ్గరకు వచ్చినా డీలాగా మాట్లాడే వాడని, బలంగా ఉన్నావని పొగిడే వారు కాదట. ఇదే విధంగా కొందరు పొగడటానికి ఇష్టపడరు. వారి ప్లేస్ ను ఎక్కడ ఆక్రమిస్తారని భయపడతారు. మరి మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా?
పెద్ద పదవిలో ఉన్న వారు కింద పదవిలో ఉన్నవారిని మెచ్చుకోవాలి. మీ కుర్చీకి ఎసరు పెడుతారని ఆలోచించవద్దు. లేదంటే పార్టీల్లో, ఆఫీసుల్లో ఎప్పుడు ఎదగలేనంతగా తయారు అవుతారు. దీని వల్ల పనితనం మెరుగుపడదు. బెటర్ రిజల్ట్ రాదు. దీని వల్ల మీకే నష్టం. అయితే ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే హనుమంతుని గురించి కాస్త తెలుసుకుందాం. హనుమతుండి ముందుకు వెళ్లి చేతులు జోడించి హనుమా నీకు తెలియనిది ఏది లేదు. ప్రపంచాన్ని కాపాడే నువ్వు మమ్మల్ని కాపాడలేవా అని అడిగితే చాలట ఆయన వెంటనే కరునిస్తాడట.
వానర లోకంలో నువ్వు బలవంతుడివి, అన్ని శాస్త్రాలు తెలిసిన వాడివి, వీరుడివి ఉపకారం చేయకుండా ఉంటావు ఏంటి అని జాంబవంతుడు అడుగుతారు. వెంటనే ఆయన ఉపకారం చేశారట. అందుకే ఒక చిన్న కీర్తన ద్వారా, శ్లోకం ద్వారా, పద్యం ద్వారా ఈయనను అడగడం వల్ల వెంటనే హనుమంతుడు కోరిన కోరికలు తీరుస్తారట. అందుకే మీకింది వారిని అయినా ఎవరిని అయిన పని బాగా చేశారంటే వారిని కీర్తించాలి. పొగడాలి. అప్పుడే మీకు వారి నుంచి మరింత ప్రయోజనం అందుతుంది.