Jr NTR War 2: ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం నిన్నటితో షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకుందట. చివరి షెడ్యూల్ లో ఎన్టీఆర్,హృతిక్ రోషన్ మధ్య ఒక అద్భుతమైన సాంగ్ ని తెరకెక్కించారట. #RRR లోని ‘నాటు నాటు’ సాంగ్ ని తలపించేలా ఈ సాంగ్ ఉంటుందని,ఇండియా లోనే ది బెస్ట్ డ్యాన్సర్లుగా పిలవబడే ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తె ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో అంతకు మించే ఉంటుందని అంటున్నారు. అయితే షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా ఎన్టీఆర్ నిన్న ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. షూటింగ్ సమయంలో ఆయన హృతిక్ రోషన్ తో బాగా కనెక్ట్ అయ్యాడని ఈ ట్వీట్ ని చూస్తే తెలుస్తుంది. అభిమానులు కూడా ఈ ఇద్దరి హీరోల మధ్య ఉన్న బాండింగ్ ని చూసి మురిసిపోతున్నారు.
Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన శేఖర్ కమ్ముల ‘కుబేర’..ఎందులో చూడాలంటే
ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘వార్ 2 మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి మా నుండి ది బెస్ట్ ఔట్పుట్ ఇచ్చేందుకు చాలా ప్రయత్నం చేశాము. హృతిక్ రోషన్ గారితో సెట్స్ లో ఉన్నన్ని రోజులు ఎంతో ఎనర్జీ గా ఉండేది. అతని ఎనర్జీ ని మాటల్లో వర్ణించలేను. ఆయన నుండి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇక డైరెక్టర్ అయాన్ ఈ సినిమాని ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా తీర్చి దిద్దాడు. రేపు థియేటర్ లో చూస్తే మీకే అర్థం అవుతుంది. అదే విధంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో నన్ను భాగం చేసినందుకు యాష్ రాజ్ ఫిలిమ్స్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ ఎలాంటి హీరో తో అయినా మంచి ఎమోషనల్ బాండింగ్ ని ఏర్పాటు చేసుకుంటాడు.
Also Read: రీమేక్ పై అక్కినేని నాగార్జున మొగ్గు..100వ సినిమా గురించి సెన్సేషనల్ న్యూస్!
#RRR సమయం లో కూడా రామ్ చరణ్ తో ఇలాంటి ఎమోషనల్ బాండింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు హృతిక్ రోషన్ తో కూడా అలాంటిదే. ఎన్టీఆర్ లో ఎదో మ్యాజిక్ ఉంది, అందుకే అందరూ ఆయనకు అలా కనెక్ట్ అయిపోతారు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 500 బెనిఫిట్ షోస్ ని ప్లాన్ చేశారు. ‘దేవర’ చిత్రం తో ఎలాంటి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందించాడో, ఈ చిత్రం తో కూడా అలాంటి ఓపెనింగ్స్ ని అందుకునేలా అన్ని రకాల ప్రణాళికలు జరిగిపోయాయి.
And It’s a wrap for #War2!
So much to take back from this one…It’s always a blast being on set with @iHrithik Sir. His energy is something I have always admired. There is so much I have learned from him on this journey of War 2.
Ayan has been amazing. He has truly set the…— Jr NTR (@tarak9999) July 7, 2025