నేడు ‘జూనియర్ ఎన్టీఆర్’ పుట్టినరోజు. అభిమానులు అండ్ సినీ ప్రముఖులు యంగ్ టైగర్ కి శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు. ఇక కోమరం భీమ్ గెటప్ లో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించే ఓ ఘనమైన సరికొత్త పోస్టర్ ను రాజమౌళి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసాడు. పోస్టర్ లో ఇన్‌టెన్స్ లుక్ లో కనిపిస్తోన్న తారక్ ఆకట్టుకున్నప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ కలిగించింది.
తారక్ బర్త్ డే నాడు కూడా ఏదైనా వీడియో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అని అభిమానుల అభిప్రాయం. మరోపక్క ఈ పోస్టర్ మాత్రం సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. అయితే, భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు మాత్రం ఈ పోస్టర్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి అప్ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటం కూడా,
వారి ఆసక్తిని మరియు అంచనాలను అందుకోలేక పోవడానికి ఒక కారణం. ఇక ‘రామ్ చరణ్’ పుట్టినరోజున, అల్లూరి గెటప్ లో ఉన్న చరణ్ కొత్త పోస్టర్ తో పోల్చుకుంటే, ఎన్టీఆర్ బర్త్ డే పోస్టర్ పెద్దగా సర్ ప్రైజ్ చేయలేదనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా కూడా ఉన్న భారీ ఇంట్రెస్ట్ వల్ల, ఈ సినిమా నుండి ఏ అవుట్ ఫుట్ వచ్చినా , అది నేషనల్ స్థాయిలో ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఇక ఈ భారీ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటం, శ్రీయ శరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.