ఇలాంటి ఆదేశాలు సామాన్య జనానికి కానీ, తన లాంటి సూపర్ స్టార్ కి కాదు అనుకున్నాడేమో మోహన్ లాల్. మొత్తానికి మలయాళ బుల్లితెర బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మోహన్ లాల్, సీక్రెట్ షూటింగ్ చేసేస్తున్నాడు. నిజానికి కరోనా సెకెండ్ వేవ్ రాకముందే మలయాళం బిగ్ బాస్ మూడో సీజన్ ప్రారంభమైంది. ఇక షోను మధ్యలో ఆపేస్తే.. నష్టం వస్తోంది అనుకున్న నిర్మాతలు కష్టం అయినా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ షో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ షో పై, మోహన్ లాల్ పై అనేక విమర్శలు వచ్చాయి. దానికితోడు ఈ షోలో పని చేసే 8 మంది సిబ్బందికి కరోనా సోకింది. దాంతో విమర్శలకు మరీ ఎక్కువైపోయాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ జరపడం పద్దతి కాదు అని అధికారులు హెచ్చరించినా మోహన్ లాల్ టీమ్ పట్టించుకోలేదు.
ఇక ఈ వ్యవహారం పై యాక్షన్ తీసుకోవాలని భావించిన పోలీసులు చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో బిగ్‌బాస్ సెట్ కు వెళ్లి మరీ షూటింగ్ ను ఆపేశారు. బిగ్ బాస్ హౌస్ లోని హౌస్ మేట్స్ ను అక్కడ నుంచి హోటల్ కు పంపించి, ప్రస్తుతానికి బిగ్ బాస్ సెట్ కి తాళం వేసి సీల్ చేశారు. అయినా తమిళనాడు ప్రభుత్వం షూటింగ్‌ల పై నిషేధం విధించినా, గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ చేయడానికి మోహన్ లాల్ లాంటి స్టార్ ఎలా ఒప్పుకున్నాడో !