Homeఎంటర్టైన్మెంట్War 2 TRP ratings: 'వార్ 2' కి డిజాస్టర్ TRP రేటింగ్స్.. ఎన్టీఆర్ కి...

War 2 TRP ratings: ‘వార్ 2’ కి డిజాస్టర్ TRP రేటింగ్స్.. ఎన్టీఆర్ కి ఘోరమైన అవమానం ఇది..

War 2 TRP ratings: గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రాల్లో ‘వార్ 2’. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత నాగవంశీ 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. కానీ ఫ్లాప్ టాక్ రావడం తో ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కనీసం 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా తెలుగు వెర్షన్ నుండి రాలేదు. ఓవరాల్ గా హిందీ లో హృతిక్ రోషన్ క్రేజ్ కారణంగా కాస్త యావరేజ్ రేంజ్ లో ఆడినప్పటికీ, కల్లెక్షన్స్ పరంగా స్పై యూనివర్స్ చిత్రాల్లోనే తక్కువ రాబట్టిన సినిమాగా నిల్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాని గత వారం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేశారు.

థియేటర్స్ లో ఎలాగో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయిన ఈ చిత్రానికి , కనీసం టీవీ టెలికాస్ట్ లో అయినా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఘోరమైన డిజాస్టర్ రేటింగ్స్ ని నమోదు చేసుకుంది. BAARC సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి మొదటి టెలికాస్ట్ లో 2.37 రేటింగ్స్ మాత్రమే నమోదు అయ్యిందట. ఇప్పటి వరకు ఒక స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయి తక్కువ రేటింగ్స్ నమోదు అవ్వలేదని , ఇది ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కి చాలా అవమానకరమైన రేటింగ్స్ అని అంటున్నారు విశ్లేషకులు. స్టార్ హీరోల సినిమాలకు కనీసం 5 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ రావడం అనేది సర్వ సాధారణం. 3 నుండి 4 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినా డిజాస్టర్ అని పిలుస్తుంది ట్రేడ్ , అలాంటిది కేవలం 2.37 రేటింగ్స్ అంటే ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ ని విలన్ క్యారెక్టర్ లో చూసేందుకు అటు థియేట్రికల్ ఆడియన్స్, ఇటు టీవీ ఆడియన్స్ ఇద్దరూ కూడా ఎలాంటి ఆసక్తి చూపించలేదని ఈ రెస్పాన్స్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20 న విడుదల చేయబోతున్నాడు. ఈ గ్లింప్స్ నిడివి దాదాపుగా 4 నిమిషాల 35 సెకండ్ల వరకు ఉంటుందని టాక్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular