https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్​ కుడి చేతికి సర్జరీ.. కోలుకోవాలని అభిమానుల ప్రార్ధనలు!

NTR: యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ తన ఇంటి జిమ్​లో వ్యాయామాలు చేస్తుండగా గాయపడినట్లు సమాచారం. తన కుడిచేతికి బలమైన దెబ్బ తాకినట్లు తెలుస్తోంది. కుడి చేతి వేలికి గాయం కావడం వల్ల నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్​ సర్జరీ చేశారని సినీ వర్గాల్లో టాక్​. ప్రస్తుతం ఎన్టీఆర్​ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొద్ది రోజులు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. నెల రోజుల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్​ను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 5, 2021 / 01:42 PM IST
    Follow us on

    NTR: యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ తన ఇంటి జిమ్​లో వ్యాయామాలు చేస్తుండగా గాయపడినట్లు సమాచారం. తన కుడిచేతికి బలమైన దెబ్బ తాకినట్లు తెలుస్తోంది. కుడి చేతి వేలికి గాయం కావడం వల్ల నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్​ సర్జరీ చేశారని సినీ వర్గాల్లో టాక్​. ప్రస్తుతం ఎన్టీఆర్​ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొద్ది రోజులు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. నెల రోజుల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్​ను ప్రారంభించనున్నారు.

    కాగా, దీపావళి పండుగరోజు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన కుమారులతో కలిసి దిగిన ఫొటోను సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు  తారక్​. ఈ ఫొటోలో తారక్ కుడి చేతికి బ్యాండేజ్​తో కనిపించారు. ఈ విషయం గమనించిన అభిమానులు ఎన్టీఆర్​ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. మరోవైపు, రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో ఎన్టీఆర్​ నటిస్తున్నారు. రామ్​చరణ్​తో కలిసి ఈ సినిమాలో కనువిందు చేయనున్నారు. పీరియాడికల్​ కథా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్​ దేవగణ్​, నటి ఆలియా భట్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తుండగా.. డీవివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తోంది చిత్రబృందం. ఇటీవల విడుదలైన గ్లింప్​ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. భారీ వ్యూస్​తో ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతోంది.

    Tags