Pragya Jaiswal: బాలయ్యతో చేసి తప్పు చేశానా ?

Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రాకపోవడంతో మొత్తానికి బాలయ్య లాంటి సీనియర్ హీరో పక్కన కూడా చేయాల్సి వచ్చింది. అయితే, ఈ మధ్య వరుసగా ఆమెకు చిన్న హీరోల పక్కనే ఛాన్స్ లు వస్తున్నాయట. గతంలో వరుణ్ తేజ్ సరసన ఆమెకు ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే, అఖండ సినిమా ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడే ఆమెను వరుణ్ సినిమా నుంచి తప్పించారు. ఇక అప్పటి నుంచి యంగ్ హీరోల […]

Written By: Shiva, Updated On : November 5, 2021 4:32 pm
Follow us on

Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రాకపోవడంతో మొత్తానికి బాలయ్య లాంటి సీనియర్ హీరో పక్కన కూడా చేయాల్సి వచ్చింది. అయితే, ఈ మధ్య వరుసగా ఆమెకు చిన్న హీరోల పక్కనే ఛాన్స్ లు వస్తున్నాయట. గతంలో వరుణ్ తేజ్ సరసన ఆమెకు ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే, అఖండ సినిమా ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడే ఆమెను వరుణ్ సినిమా నుంచి తప్పించారు.

ఇక అప్పటి నుంచి యంగ్ హీరోల చిత్రాల్లో కూడా ఛాన్స్ లు రావడం లేదు. బాలయ్యతో చేసి తప్పు చేశానా ? అనే బాధలో ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ విచారం వ్యక్తం చేస్తోంది. నిజానికి ‘అఖండ’ సినిమాలో ఆమె లుక్ అండ్ క్యారెక్టర్ చాలా బాగున్నాయి. ఆ మధ్య ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ ‘అడిగా అడిగా’లో ప్రగ్యా బాగా హైలైట్ అయింది. ఫీల్‌ గుడ్‌ మెలోడి సాంగ్ కావడంతో బాలయ్య కంటే కూడా ఆమెనే ఎక్కువ హైలైట్ చేశారు.

బాలయ్య సిగ్గు పడుతూ బైక్ పై ప్రగ్యా జైస్వాల్ ను అలా కూర్చోపెట్టుకుని.. వెనుక నుంచి ఆమెను హత్తుకుంటున్న విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రగ్యా జైస్వాల్ కూడా చాలా అందంగా కనిపిస్తూ బాగా ఆకట్టుకుంది. దాంతో ఆమెకు అఖండ సినిమా బాగా కలిసి వస్తోంది అనుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

దీనికితోడు కరోనా లాక్ డౌన్ తర్వాత ఆమెకు వచ్చిన సినిమా ఒక్క అఖండ మాత్రమే. బాలకృష్ణ తో కలిసి అఖండ సినిమా చేయాలా ? వద్దా ? అని ఆలోచించుకునే అవకాశం కూడా ఆమెకు అప్పుడు లేకుండా పోయింది. చేతిలో సినిమాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అఖండ చేయడానికి అంగీకరించింది.

అయితే, ఆ తర్వాత తనకు రావాల్సిన సినిమాలు కూడా రాకుండా పోవడం, అందుకు కారణంగా అఖండ సినిమాలో బాలయ్య పక్కన నటించడమే అని చెప్పడం మొత్తమ్మీద ప్రగ్యాను ఇంకా బాధ పెడుతుంది. ఒక్కోసారి బ్యాడ్ టైమ్ లో సినిమా అవకాశాలు రాకపోవడం అనేది సర్వసాధారణం. హీరోయిన్ల విషయంలో ఇక ఇది చెప్పనక్కర్లేదు. కాబట్టి, ప్రగ్యా బాధ పడకుండా కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం బెటర్.

Tags