COP26: భూతాపం వేడెక్కుతోంది. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రపంచం వినాశనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ప్రభావితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్ర్తవేత్తల హెచ్చరికలను ఎవరు ఖాతరు చేయడం లేదు. దీంతో భూమి వేగంగా వేడెక్కుతోంది. అధిక వర్షాలు పడి పలు నగరాలు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో పెరిగిపోతున్న భూతాపంతో అధిక నష్టాలే చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్ ఇటీవల వెల్లడించిన ఓ సర్వేలో శాస్ర్తవేత్తలు వాతావరణ పరిస్థితులపై హెచ్చరించారు. వనరుల వినాశనం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు అంధకారమే అని ప్రకటించారు. కానీ ప్రపంచం పట్టించుకోవడం లేదన్నారు. దీంతోనే జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. 2100 నాటికి భూమి నాశనం వైపు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి కూడా ఏనాడో హెచ్చరించింది. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు నడం కట్టాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఆదేశించింది.
గ్లోబల్ వార్మింగ్ ను ఎవరు లెక్క చేయడం లేదు. దీంతో సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్నఉష్ణోగ్రతలు, కాలుష్యంతో జీవరాశుల మనుగడ కూడా కష్టమైపోతోంది. దీంతో కూడా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయంగా జంతు సంపద రోజురోజుకు క్షీణిస్తోంది. దీని వల్ల పర్యావరణం క్రమంగా పాడైపోతోంది. ఈ పరిణామాలతోనే మానవాళికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.
నేచర్ నిర్వహించిన ఓ సర్వేలో భూమి ఈ శతాబ్దం వరకు పూర్తిగా నాశనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పింది. దీంతో అకాల వర్షాలు, సునామీలు, అధిక ఉష్ణోగ్రతలు, కరువు కాటకాలు వంటివి ఏర్పడే వీలుందని చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క దేశం కూడా పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టాల్సిన అవసరం గుర్తించడం లేదు. ఫలితంగా ఉష్ణోగ్రత మూడు సెంటిగ్రేడ్ లు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.