‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’తో భారీ హిట్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రానికి డైరెక్టర్. . మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ను ఈ మధ్యే ఫైనల్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో షూటింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ… ఈ మూవీలో విలన్ రోల్‌పై మాత్రం సస్పెన్స్ వీడడం లేదు. బ్యాంకింగ్ మోసాల బ్రాక్‌డ్రాప్‌లో సాగే కథ ప్రకారం దీనికి ఓ స్టైలిష్ విలన్ అవసరం. ఆ పాత్రలో నటించేది ఎవరనే విషయంపై చిత్రబృందం ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. విలన్ పాత్రకు ముందు ఉపేంద్ర, ఆ తర్వాత సుదీప్ పేర్లు వినిపించాయి. వాళ్లలో ఎవరు నటించిన కోలీవుడ్ మార్కెట్‌కు ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావించింది. కానీ, ఇద్దరూ నో చెప్పారట. దాంతో ఇప్పుడు మరో తమిళ సీనియర్ హీరో అరవింద్ స్వామి ని చిత్ర బృందం సంప్రదించిందట.
వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్న అరవింద్ నేరుగా టాలీవుడ్‌లో నటించి చాలా కాలమైంది. 2016లో రామ్‌చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ధృవ’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా మెప్పించాడు. ఆ క్రైమ్ థ్రిల్లర్లో హీరోతో పోటాపోటీగా ఉండే క్యారెక్టర్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమాకు చాలా ప్లస్ అయ్యాడు. దాంతో, ఇప్పుడు మహేశ్ లెవల్‌కు అరవింద్ అయితేనే బాగుటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. అరవింద్ నటిస్తే తమిళ్‌లో కూడా ఈ మూవీకి క్రేజ్ వస్తుంది. ఇదే విషయాన్ని స్వామికి చెబితే అతను ఒప్పుకున్నట్టు టాలీవుడ్ టాక్. దీనిపై యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయాల్సి ఉంది.