NTR dream role: నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో తన సత్తా చాటుతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు సినిమాల విషయంలో చాలా క్లారిటి ని మెంటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. దేవర సినిమాతో పాన్ ఇండియా సినిమా చేసిన కూడా ఆయనకి పెద్దగా కలిసి రాలేదు. ఆ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేదు. ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా భారీ డిజాస్టర్ అయింది. దాంతో బాలీవుడ్ దర్శకులతో మరో సినిమా చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చాడట….ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా తనకిష్టమైన తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…ఇంతకీ ఆ క్యారెక్టర్ ఏంటి అంటే ‘శ్రీ కృష్ణుడి’ పాత్ర కావడం విశేషం…
ఇది తన డ్రీమ్ క్యారెక్టర్ అని అందులో వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని వాటిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా పండించగలిగితే ఆయన సక్సెస్ అయినట్టే అని పలు సందర్భాల్లో తమ కుటుంబ సభ్యులతో పాటు తన సన్నిహితుల దగ్గర కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారట. ఆయనని కృష్ణుడిగా పెట్టి సినిమా చేయగలిగే దమ్మున్న దర్శకుడు ఎవరున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చలైతే జరుగుతున్నాయి.
Also Read: ‘ధురంధర్ 2’ సునామీ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తట్టుకోగలదా..? తేడా జరిగితే పరువు పోయినట్టే!
నిజానికి కృష్ణుడి పాత్ర ను తెలుగులో స్టార్ హీరోలెవరు పెద్దగా పోషించలేదు. చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా చేయలేకపోయాడు. సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆ పాత్రకి 100% న్యాయం చేయగలిగాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి చేయబోతున్న మహాభారతం సినిమాలో ఎన్టీఆర్ ని కృష్ణుడిగా తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ముందుగానే తనకు కృష్ణుడి పాత్ర అంటే ఇష్టమని చెబుతున్నాడా అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
రాజమౌళి మాత్రం తన రాసుకున్న క్యారెక్టర్ కి ఎవరైతే బాగా సెట్ అవుతారో వాళ్ళని మాత్రమే సినిమాలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడట… మరి తను చేయబోయే మహాభారతం సినిమాలో కృష్ణుడిగా ఎవరు చేస్తారుఅనే విషయం పైన రాజమౌళి ఇప్పటివరకు స్పందించలేదు. ఒకవేళ ఆ పాత్రలో ఎన్టీఆర్ ని తీసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు…