లైఫ్ స్టైల్Marriage: మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా?

Marriage: మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా?

Marriage: పెళ్లి అనే బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఈ రోజుల్లో పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. వధూవరులకు ఇద్దరు నచ్చాలి. ఆ తర్వాత పెళ్లి. ఇక పెళ్లి ఖర్చులు అంటారా? వామ్మో తడిసి మోపెడు అవుతాయి. అమ్మాయి తరుపు వారు అయితే అప్పుల పాలు కావాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ముహుర్తాలు, జాతకాలు చూడనిదే ఎవరు పెళ్లి చేసుకోరు. కచ్చితంగా వధూవరుల జాతకాలు కలవాల్సిందే. లేదంటే పెళ్లి క్యాన్సిల్ కూడా చేస్తారు. అందుకే ముందే అన్నీ విషయాలు చర్చించుకుంటారు.

ఇక ప్రేమ పెళ్లి లో ఇది జరగడం లేదు కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లి లో మాత్రం ఇప్పటికీ జాతకాలు చూస్తుంటారు. ఇక మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంటారు కొందరు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయని నమ్ముతుంటారు. మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దా? చేసుకుంటే సమస్యలు వస్తాయా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్ర పరంగా చూస్తే ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫుల్ లక్ అంటున్నారు పండితులు. కానీ చాలా మంది మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని, అలా చేసుకుంటే చిక్కుల్లో పడాల్సిందే అంటారు. అయితే ఇవన్నీ అపోహలేనట. నిజానికి అలాంటివి జరగవు. ఒకవేళ ఇదే నిజం అయితే అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి సమస్యలు రావాలి. పైగా పుట్టిన వాళ్లకు కూడా అమ్మాయి వల్ల సమస్యలు రావాలి.

మరి అలాంటివి ఏం జరగనప్పుడు కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే సమస్యలు వస్తాయి అనడం ఎంతవరకు కరెక్ట్. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిల్లో బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ లెక్క ప్రకారం వారు ఇబ్బందులు పడాలి కానీ మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయకూడదు కదా. మరో విషయం మూల నక్షత్రంలో పుట్టి పెళ్లి చేసుకున్నవారు సంతోషంగా ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఇలాంటి వాటిని గుడ్డిగా నమ్మకండి అంటారు కొందరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...
New smartphones launching April

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు...

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...
After Meal Tips

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో...
Stress Relief

Stress Relief: రోజులో 24 నిమిషాలు ఇలా చేస్తే.. ఒత్తిడి మాయం..

Stress Relief: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, సామాజిక ఒత్తిళ్లు వంటి అనేక కారణాలతో మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఆరోగ్యాన్ని కంటే...
Oktelugu Epaper