Homeఎంటర్టైన్మెంట్Johnny Master vs Shekar Master : జానీ మాస్టర్ vs శేఖర్ మాస్టర్.. హద్దులు...

Johnny Master vs Shekar Master : జానీ మాస్టర్ vs శేఖర్ మాస్టర్.. హద్దులు దాటేసిన కొట్లాట.. వీడియో వైరల్..

Johnny Master vs Shekar Master : చిన్న హీరోల దగ్గర నుండి సూపర్ స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరికి ఇప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లు కావాలి. ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో లారెన్స్ , ప్రభుదేవా మాస్టర్స్ కి ఏ రేంజ్ డిమాండ్ ఉండేదో , ఇప్పుడు వీళ్లిద్దరికీ ఆ రేంజ్ డిమాండ్ ఉంది. ఇలాంటి డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్స్ మధ్య కోల్డ్ వార్ బలంగా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్లిద్దరు ఇన్నాళ్లు అలా లేరు , చాలా స్నేహం గా ఉండేవారు, కలిసి షోస్ లో కూడా పాల్గొనేవారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు చిన్న గ్యాప్ ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అందుకు నిదర్శనంగా నేడు వీళ్లిద్దరికీ సంబంధించిన వర్గాల మధ్య గొడవ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికలు , సభ్యత్వాలు విషయంలో ఇరు వర్గాల మధ్య నేడు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయట. సభ్యుల సంక్షేమం తో పాటు , ఇతర అంతర్గత విషయాలపై ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారట. ఈ రెండు బృందాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడం తో అస్సోసియేషన్ లో గందరగోళం వాతారణం నెలకొన్నది. ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని , యూనియన్ పెద్దలు కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోని మీ కోసం చివర్లో అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో లో శేఖర్ మాస్టర్ తరుపున శ్రేష్టి వర్మ ఉంది. ఈమె ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు జానీ మాస్టర్ వద్ద కొరియోగ్రాఫర్ చేసి , అతను లైంగిక వేధింపులు చేస్తున్నారు అంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది.

ఈ కేసు వ్యవహారం లో జానీ మాస్టర్ నెల రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా జైలు లో గడిపారు. అంతే కాకుండా అతనికి వచ్చిన నేషనల్ అవార్డు కూడా కేవలం ఈ కేసు కారణంగా రద్దు అయ్యింది. అయితే ఈ వీడియో లో శేఖర్ మాస్టర్ తో శ్రేష్టి వర్మ ని చూసిన నెటిజెన్స్ లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో జానీ మాస్టర్ మాట్లాడుతూ , తనపై కావాలని కొంతమంది కుట్రలు చేసి ఈ కేసు ని నమోదు చేయించారని అన్నారు. ఆ కుట్రలో శేఖర్ మాస్టర్ హస్తం ఏమైనా ఉందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular