https://oktelugu.com/

‘సలార్’ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో !

బాహుబలి లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత డార్లింగ్ ప్రభాస్ సాహో మూవీతో ఇండియా మొత్తం అలరించి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. డార్లింగ్ ఇప్పుడు వరుసపెట్టి అన్ని పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. దీని తర్వాత ‘ఆది పురుష్’, ‘సలార్ ‘ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఈ నెలలోనే సెట్స్ పైకి వెళుతున్నట్లుగా […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 05:28 PM IST
    Follow us on


    బాహుబలి లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత డార్లింగ్ ప్రభాస్ సాహో మూవీతో ఇండియా మొత్తం అలరించి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. డార్లింగ్ ఇప్పుడు వరుసపెట్టి అన్ని పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. దీని తర్వాత ‘ఆది పురుష్’, ‘సలార్ ‘ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఈ నెలలోనే సెట్స్ పైకి వెళుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

    Also Read: హిట్ డైరెక్టర్ కి రిలీఫ్ ఇచ్చిన రవితేజ !

    తాజాగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ నుండి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచింది. ఈ మూవీలో ప్రభాస్ ని ఢీకొట్టడానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఈ స్టార్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా, త్వరలోనే దీనికి సంబందించిన అప్డేట్ అధికారకంగా ప్రకటిస్తారని సమాచారం. అయితే ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ లో కూడా ప్రభాస్ పక్కన బాలీవుడ్ స్టార్ ని సెలెక్ట్ చేయటం చూసి మా డార్లింగ్ రేంజ్ అది అని అభిమానులు తెగ సంబరపడి పోతున్నారట.

    Also Read: పక్కా ‘కమర్షియల్’ హిట్ ఇస్తాడంటా !

    ఏదేమైనా మన తెలుగు హీరో ఇలా పాన్ ఇండియా సినిమాలు చేయటం మన తెలుగు వారందరికీ గర్వకారణం. కెజిఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ప్ర‌శాంత్ నీల్, స‌లార్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రాధే శ్యామ్ మూవీ షూటింగ్ ఫుల్ జోష్ లో నడుస్తుంది. ఈ సినిమాని వచ్చే దసరా పండుగ సమయానికి విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్