మనలో చాలామంది మన దగ్గర ఉన్న డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే పోస్టాఫీస్ లు కస్టమర్ల కోసం ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్నాయి. ఈ స్కీమ్ లలో కొన్ని స్కీమ్ ల ద్వారా తక్కువ సమయంలోనే రెట్టింపు డబ్బును పొందే అవకాశం ఉంటుంది. అయితే స్కీమ్ ల గురించి సరైన అవగాహన ఉంటే మాత్రమే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ కోర్సులు చేస్తే జాబ్ గ్యారంటీ..?
అలా పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్ లలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి. 1,000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ లో చేరిన వారికి 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ లో చేరిన వారికి ఖాతాల్లో నగదు జమవుతుంది. ఎంత మొత్తం డిపాజిట్ చేసినా పది సంవత్సరాల్లో రెట్టింపు మొత్తం డబ్బులను పొందవచ్చు.
Also Read: ఫోన్ పే యూజర్లకు శుభవార్త.. రూ.149కే ఇన్సూరెన్స్ పాలసీ..?
కనీసం 1,000 రూపాయల నుంచి డిపాజిట్ చేసే అవకాశం ఉండటంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కూడా ఈ స్కీమ్ లో చేరి డిపాజిట్ చేయడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు మంచి లాభాలు ఇచ్చినా వాటిలో పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరైనా కచ్చితమైన లాభాలను పొందాలని అనుకుంటే మాత్రం ఈ స్కీమ్ ద్వారా డిపాజిట్ చేస్తే మంచిది.
మరిన్ని వార్తల కోసం: జనరల్
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆశించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.