https://oktelugu.com/

కరోనాని జయించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

మెగా అభిమానులకి శుభ వార్త… మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరూ కరోనా భారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా తాను క‌రోనా నుంచి బయటపడ్డానని, రిపోర్ట్‌లో కరోనా నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వరుణ్ తేజ్. Also Read: ‘సలార్’ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ! గత […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 05:35 PM IST
    Follow us on


    మెగా అభిమానులకి శుభ వార్త… మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరూ కరోనా భారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా తాను క‌రోనా నుంచి బయటపడ్డానని, రిపోర్ట్‌లో కరోనా నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వరుణ్ తేజ్.

    Also Read: ‘సలార్’ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో !

    గత నెల 28న త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆ మ‌రుస‌టి రోజే వ‌రుణ్ కూడా క‌రోనా సోకిన‌ట్లు తెలిపాడు. దీంతో మెగాభిమానుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు ఒకచోట కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. దాంతో ఎవరెవరికి సోకిందో అని అందరూ భయపడ్డారు. అదృష్ట వశాత్తు ఇంకెవరికీ రాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

    Also Read: హిట్ డైరెక్టర్ కి రిలీఫ్ ఇచ్చిన రవితేజ !

    కరోనా వచ్చిన వారం రోజుల అనంతరం నిర్వహించిన పరీక్షలో వరుణ్ ‌తేజ్‌కి కరోనా నెగటివ్‌ అని నిర్దారణ అయ్యిందట. ‘నెగటివ్‌ అనే రిపోర్టు ఇంత ఆనందాన్ని ఇస్తుందని ఎప్పుడూ అనుకోలేదు’ అంటూ హీరో వరుణ్‌ ట్వీట్‌ చేశారు. కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చిందని, తన కోసం ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ కృతఙ్ఞతలు అని వరుణ్‌ పేర్కొన్నారు. మరోవైపు హీరో రామ్‌చరణ్‌,భార్య ఉపాసన ఇద్దరు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ బయటకి రాలేదు. మెగా అభిమానులంతా త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్