Jio OTT Plans : ప్రస్తుత కాలంలో థియేటర్లోకి వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. చాలామంది ఓ టి టి లకు అలవాటు పడిపోయి అందులోనే సినిమాలు చూస్తున్నారు. తక్కువ ధరతో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమాలో చూసి అవకాశాన్ని OTT సంస్థలు కల్పించడంతో చాలామంది వీటిని ఫాలో అవుతున్నారు. కొందరు థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల కోసం కంటే OTT లో సినిమాలు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం తాజాగా JIO సంస్థ తాజాగా సూపర్ న్యూస్ ను అందించింది. అతి తక్కువ ధరకే కాల్స్ తో పాటు డేటాను అందించి బోలెడు ఎంటర్టైన్మెంట్ చానల్స్ ను అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
Entertainment రంగంలో జియో ఓ టి టి ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మిగతా సంస్థల కంటే ఈ సంస్థ కొన్నింటిని ఉచితంగా ఆఫర్ చేస్తుంది. గతంలో కీప్యాడ్ ఫోన్లోనూ సైతం సినిమాలు చూసే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య జియో ప్లాన్ ధరలు పెరిగాయి. కానీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజాగా జియో కొత్తగా రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి రూ 175 తో రీఛార్జ్ చేసుకుంటే పది 10 ఉచిత ఓ టి టి యాప్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవచ్చు. వీటిలో జియో సినిమా ప్రీమియం, సోనీ లైవ్, జియో 5, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ప్లానెట్ మరాటి, చౌపాల్, జియో టీవీ ఉన్నాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు. సినిమాలో చూడాలని అనుకునే వారికి అతి తక్కువ ధరలో ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది
Also Read : జీయోహాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్.. ప్లాన్స్ అప్‌డేట్ చేసిన జియో, ఎయిర్‌టెల్
ఇదే సంస్థ మరో ప్లాను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ ఫోర్ ఫోర్ ఫైవ్ తో రీఛార్జ్ చేసుకుంటే 12 ఓ టి టి యాప్ లను సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. వీటిలో సోనీ లివ్, జియో 5, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, జియో టీవీ, జియో క్లౌడ్, hoichoi, Fanscode వంటివి అందిస్తున్నారు. దీని వీటితోపాటు మొత్తం 56 జిబి డేటా వస్తుంది. దీనిని ప్రతిరోజు 2GB లిమిట్ తో వాడుకోవచ్చు.
ప్రస్తుతం సినిమా చూడాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. అయితే తక్కువ ధరలోనే అన్ని రకాల సినిమాలను ఇంట్లో లేదా మొబైల్లో చూసుకునేందుకు ఈ అవకాశం అద్భుతంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఈ ప్లాన్ లోకి వర్తిస్తాయని పేర్కొంటున్నారు. జియోతోపాటు మిగతా సంస్థలు కూడా వారు సేకరించే సినిమాలను కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు. వీటితోపాటు అదనంగా కొన్ని యాప్స్ ఉచితంగా అందించబడతాయి. అయితే ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మాత్రమే ఇది సౌకర్యంగా ఉంటుంది. వీటిలో కాల్స్ అందించబడవు. ఆ విషయం నిర్ధారించుకున్న తర్వాతే వీటిని ఎంచుకోవాలి.
Also Read : టాటా ప్లేతో జత కట్టిన ఎయిర్ టెల్.. త్వరలో డిజిటల్ టీవీ.. డీటీహెచ్‌కు ఆదరణ తగ్గుతుండడంతో కీలక నిర్ణయం!