AP Budget 2025 : ఏపీ ( Andhra Pradesh)బడ్జెట్లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం లభించింది. రాజకీయంగా పట్టు సాధించే క్రమంలో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సంక్షేమ రంగానికి భారీగా కేటాయింపులు చేసినట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. 2019 ఎన్నికల్లో టిడిపి వర్గాలుగా ఉన్న బీసీలు వైయస్సార్ కాంగ్రెస్ వైపు వెళ్లారు. దానిని పదిలం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి బీసీలకు అనేక పథకాలు ప్రకటించారు. అయితే వాటిని నవరత్నాల్లోనే చూపించారు. దీంతో బీసీలు తమ మనసు మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతు తెలిపారు. అయితే బీసీలు మరోవైపు ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
* సంక్షేమ రంగానికి అధిక ప్రతిపాదనలు
సంక్షేమ రంగానికి( welfare field) ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. భారీగా నిధులు కేటాయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 13,487 కోట్లు కేటాయించారు. పౌరసరఫరాల శాఖకు రూ.3806 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇక ఎస్సీల సంక్షేమానికి ఏకంగా రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8159 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5434 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4332 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
Also Read : ఏపీ బడ్జెట్.. వాటికే అధిక కేటాయింపులు.. చంద్రబాబు టార్గెట్ ఫిక్స్!
* బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం
బీసీ సంక్షేమానికి( BC welfare) మాత్రం అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి బీసీలకు ప్రత్యేక పథకాలు ప్రకటించేవారు. రాయితీపై రుణాలు అందించేవారు. ఆదరణ పథకం కింద వృత్తిపరమైన పరికరాలు,యంత్రాలు అందించేవారు. మరోసారి అదే ప్రయత్నం చేయనుంది టిడిపి కూటమి ప్రభుత్వం. భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో ఈ ఐదేళ్లపాటు రాయితీ రుణాల పంపిణీ ప్రక్రియ కొనసాగనంది. అదే సమయంలో వృత్తిపరమైన ప్రోత్సాహకాలు కూడా అందించనుంది. మరోసారి బీసీలు ఇతర రాజకీయ పార్టీల వైపు చూడకుండా ఉండేందుకు ఈ కేటాయింపులు దోహద పడనున్నాయని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.
* ఆ రెండు వర్గాలకు సైతం
బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు అసంతృప్తికి గురికాకుండా ఆ రెండు సామాజిక వర్గాలకు సైతం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. భారీగా కేటాయింపులు కూడా చేశారు. అయితే బడ్జెట్ కేటాయింపులు ఓకే కానీ.. మంజూరు ప్రక్రియ కూడా అదే మాదిరిగా జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అప్పట్లో కేటాయింపులు చేసింది. కానీ వాటిని నవరత్నాల్లో భాగంగా చూపించింది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు అందిస్తూ వచ్చిన రాజ్యాంగబద్ధపు నిధులు కూడా నిలిపివేసింది. ఆ పరిస్థితి లేకుండా చూడాలని ఆ మూడు వర్గాలు కోరుకుంటున్నాయి.