https://oktelugu.com/

Payyavula Keshav: ఇక ఏపీకి అప్పు పుట్టదా? అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి సంచలనం!

రాష్ట్రం అప్పుల పుట్టగా మారింది. అప్పులు నిరంతరాయం అవుతున్నాయి. ఇక అప్పు పుట్టే ఛాన్స్ లేదని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

Written By: , Updated On : February 28, 2025 / 01:06 PM IST
Payyavula Keshav

Payyavula Keshav

Follow us on

Payyavula Keshav: ఏపీ అసెంబ్లీలో( AP assembly) ఈరోజు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్( budget) ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ ప్రసంగంలో ఓ కీలక విషయాన్ని చెప్పేశారు కేశవ్. గత రెండు ప్రభుత్వాల్లో అప్పులపై తీవ్ర చర్చ నడిచింది. దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఎంతో కష్టతరమని గుర్తు చేశారు కేశవ్. గత వైసిపి ప్రభుత్వంలో ఆర్థిక అరాచకం జరిగిందని ఆరోపించారు. ఆయా శాఖల్లో లెక్కలను కొలిక్కి తీసుకువచ్చేందుకు చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ అరాచకాలను స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.

Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సరికొత్త ఫైర్ బ్రాండ్ ఆమె!

* నీతి ఆయోగ్ స్పష్టం
ఏపీ రుణ సామర్థ్యాన్ని సున్నాకు తీసుకు వచ్చారని.. రాష్ట్రానికి అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా చేసిన విషయాన్ని నీతి ఆయోగ్( Niti Aayog) స్పష్టం చేసిందని చెప్పారు. తద్వారా దేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు మాటలే తమకు మార్గదర్శకంగా నిలిచాయని చెప్పుకొచ్చారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అప్పట్లో అను దాడిలో విధ్వంసమైన హీరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది.. తిరిగి ఏపీ నిలబట్టలేమా అని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు.

* రాష్ట్రాలకు అప్పులు సహజం
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తుంటాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో( welfare schemes) పాటు పాలనను ముందుకు తీసుకెళ్లేందుకు అప్పులు అవసరం కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించింది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ అనుమతితోనే అప్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఏపీలో పరిమితికి మించి అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కారణాలు చెప్పి అప్పులు చేసింది. ఇంకా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు వాడుకుంది. బాండ్ల రూపంలో సైతం అప్పులు చేసింది. ఈ తరుణంలోనే నీతి ఆయోగ్ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టింది. పరిమితికి మించి అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీని స్పష్టం చేసింది నీతి ఆయోగ్. అదే విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దీంతో మరోసారి ఏపీ అప్పులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

 

Also Read: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీకు షాక్‌.. ఇక ఆ సీట్లనీ మనకే!