Homeఎంటర్టైన్మెంట్Jetlee Movie First Day Collections: 'జెట్లీ' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇలా...

Jetlee Movie First Day Collections: ‘జెట్లీ’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అసాధ్యమే..

Jetlee Movie First Day Collections: ‘మత్తు వదలరా 2’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ నితీష్ రానా(Nitesh Rana) నుండి తెరకెక్కిన ‘జెట్లీ'(Jet Lee Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విరుద్దలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి ఆట నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఎక్కడా కూడా ఫ్లాప్ టాక్ రాలేదు , కచ్చితంగా ఒకసారి చూడొచ్చు టైం పాస్ కోసం అనే విధమైన టాక్ మాత్రమే ఈ చిత్రానికి వచ్చింది. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుందా లేదా?, హీరోగా సత్య మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంటాడా లేదా?, అసలు మొదటి రోజు ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి వంటి వివరాలను ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సత్య రేంజ్ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది కానీ , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి అది ఏ మాత్రం సరిపోదు.

విడుదలకు ముందు ఈ చిత్రానికి దాదాపుగా 5 కోట్ల రూపాయిల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ మొదటి రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1 కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం నుండి 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు కాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 52 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 1 కోటి 20 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు, 60 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి నమోదు అయ్యాయి.

అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల నుండి ఈ చిత్రానికి 20 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు కాగా, ఓవర్సీస్ నుండి 50 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ నమోదు అయ్యింది. ఓవరాల్ గా 1 కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజున 16 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అయితే నేడు శనివారం కాబట్టి ఇంకా ఎక్కువ టిక్కెట్లు అమ్ముడుపోవాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 11 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఇది మంచి ట్రెండ్ కాదు, ఇలా అయితే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular