spot_img
Homeలైఫ్ స్టైల్No Physical Aadhaar Card Requirement: ఇక ఫిజికల్ ఆధార్ అవసరం లేదు..!

No Physical Aadhaar Card Requirement: ఇక ఫిజికల్ ఆధార్ అవసరం లేదు..!

No Physical Aadhaar Card Requirement: Aadhar కార్డు లేకుంటే ఏ పని ముందుకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని అవసరాలకు వెంటనే ఆధార్ కార్డు కావాలంటే ఫిజికల్ గా అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో గూగుల్ సంస్థ వాలెట్‌లో ఆధార్‌ను డిజిటల్ ఐడీ రూపంలో భద్రపర్చుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. UIDAI భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫీచర్ వల్ల ఫోన్‌లోనే ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకుని అవసరమైనప్పుడు చూపించుకోవచ్చు.ఈ సౌకర్యాన్ని ఎలా పొందవచ్చో చూద్దాం..

ఐడెంటిటీ వెరిఫికేషన్‌ కోసం ఆధార్ తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు ఎప్పటికీ అందుబాటులో ఉండకపోవడంతో ఇప్పటి వరకు చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దీని పరిష్కారానికి, ఐడెంటిటీ వెరిఫికేషన్ సులభం చేయడానికి గూగుల్ వాలెట్‌లో స్టోర్ చేసిన ఆధార్‌ను ఆన్‌లైన్‌తో పాటు కొన్ని ఆఫ్‌లైన్ వేరిఫికేషన్ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రైవసీ పరంగా ఇది కీలకమైన మార్పు. పూర్తిస్థాయి ఆధార్ వివరాలన్నీ ఎక్కడపడితే అక్కడ పంచాల్సిన అవసరం లేకుండా, అవసరమైన సందర్భంలో మాత్రమే పరిమిత సమాచారం చూపించే వెసులుబాటు ఈ ఫీచర్‌లో ఉంది. అందువల్ల, వయసు లేదా గుర్తింపు నిర్ధారణ కోసం అడిగే చోట పూర్తి కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది.

ఆధార్‌ను గూగుల్ వాలెట్‌కు జోడించడానికి యూజర్ తన ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం .. UIDAI యాప్‌లోని షేర్ ఐడీ ఆప్షన్ ద్వారా కూడా ఈ సేవను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రమే ప్రారంభించారు. వీటిలో పీవీఆర్ ఐనాక్స్, భారత్ మ్యాట్రిమోనీ వంటి చోట్ల ఆధార్ వెరిఫికేషన్‌కు ఇది ఉపయోగపడనుంది. త్వరలో మరిన్ని భాగస్వామ్య వేదికలకు విస్తరించే అవకాశం ఉంది.

భద్రత విషయానికొస్తే.. వాలెట్‌లో నిల్వ చేసే డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. అంతేకాదు స్క్రీన్ లాక్ లేదా బయోమెట్రిక్స్ వంటి డివైస్ సెక్యూరిటీ ఫీచర్లతో అది రక్షించబడుతుందని గూగుల్ తెలిపింది. అంటే ఇది సాధారణ ఫైల్‌లా కాకుండా, భద్రతను ప్రధానంగా ఉంచిన డిజిటల్ ఐడీ సిస్టమ్ అన్నమాట. ఆధార్ కార్డు తీసుకెళ్లే అవసరాన్ని తగ్గిస్తూ, వెరిఫికేషన్‌ను వేగంగా, సురక్షితంగా, ప్రైవసీకి అనుగుణంగా మార్చే ప్రయత్నమే ఈ కొత్త ఫీచర్ అని గూగుల్ నిపుణులు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper