Jet Lee song viral : సన్నివేశాల్లో పెద్దగా స్టఫ్ లేకపోయినా తమ కామెడీ టైమింగ్ తో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే టాలెంట్ ఉన్న కమెడియన్స్ మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉన్నారు. సునీల్, బ్రహ్మానందం , ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్ వంటి వారు ఈ కోవకు చెందిన వాళ్ళే. ఇప్పుడు ఆ జాబితాలోకి కమెడియన్ సత్య కూడా వచ్చేసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతను చేసే కామెడీ కి పొట్టచెక్కలు అవ్వాల్సిందే. బాగాలేని సన్నివేశాన్ని కూడా ఎంటర్టైన్ చెయ్యగలడు. సత్య ఒక సినిమాలో ఉన్నదంటే చాలు, అది హిట్ అయిపోయినట్టే , కేవలం అతని కోసం థియేటర్ కి వెళ్లిపోవచ్చు అని అనుకునే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. అలాంటి సత్య హీరో గా ఇప్పుడు ‘జెట్ లీ’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నితీష్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు.
గతంలో ఈయన మత్తు వదలరా , మత్తు వదలరా 2, హ్యాపీ బర్త్ డే వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాల్లో సత్య కామెడీ టైమింగ్ ని నితీష్ రానా ఏ రేంజ్ లో వాడుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటిది ఇప్పుడు సత్య ని హీరో గా పెట్టి సినిమా తీస్తున్నాడు. ఇక ఏ రేంజ్ లో వాడుకొని ఉండుంటాడో మీరే ఊహించుకోండి. ఈ చిత్రం లో మిస్ ఇండియా రియా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం లోని మొదటి పాటని నిన్ననే విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రోజులోనే దాదాపుగా 37 లక్షల మంది ఈ పాటని వీక్షించారు.
స్టార్ హీరోలకు తప్ప, కనీసం మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదు. దీనిని బట్టీ ఈ పాట ఏ రేంజ్ లో పేలిందో అర్థం చేసుకోవచ్చు . ముఖ్యంగా సత్య డ్యాన్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. అప్పట్లో సునీల్ కమెడియన్ గా ఉంటూ ఒక్కసారిగా హీరోగా మారి అద్భుతమైన డ్యాన్స్ చేసినప్పుడు ఆడియన్స్ ఏ రేంజ్ లో సర్ప్రైజ్ కి గురై మెంటలెక్కిపోయారో, ఇప్పుడు సత్య కూడా తన డ్యాన్స్ తో ప్రేక్షకులను అలాంటి ట్రాన్స్ లోకి నెట్టేశారు. అంత పెద్ద శరీరం తో ఆ మూవ్మెంట్స్ ఏంటి?, ఆ గ్రేస్ ఏంటి?, పాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి ని తలపించినట్టు ఉందని , అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకు కూడా అలాంటి అనుభూతి కలిగిందో లేదో ఈ డ్యాన్స్ వీడియో ని చూసే మీరే కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
