Sivatmika Rajasekhar: ఇండస్ట్రీ లో అందరి బాగు కోరుకునే మనిషి మెగాస్టార్ చిరంజీవి. తనకి కీడు చెయ్యాలని చూసిన వారికి కూడా ఆయన ఎంతో మేలు చేసాడు. చిరంజీవి లో ఉన్న అతి మంచితనం చూసి అభిమానులకు ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కరి నుండి కూడా సపోర్ట్ రాని సంగతి అందరికీ తెలిసిందే.
చిరంజీవికి సపోర్టు చెయ్యకపోయినా కూడా చాలామంది సైలెంట్ గానే ఉండేవారు. కానీ జీవిత మరియు రాజశేఖర్ మాత్రం అప్పట్లో మీడియా ముందుకొచ్చి మాట్లాడిన మాటలు అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి, ఇష్టమొచ్చినట్టుగా చిరంజీవి పై ఆరోపణలు చేసారు. అబ్దుల్ కలాం లాంటి వారు కూడా మెచ్చుకున్నటువంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి కూడా రాజశేఖర్ చాలా నీచమైన కామెంట్స్ చేసాడు. చిరంజీవి అభిమానుల రక్తాన్ని దోచుకొని అమ్ముకుంటున్నాడని అసత్య ప్రచారం చేసాడు.
అప్పట్లో ఈ ప్రచారం పెను దుమారమే రేపింది, చిరంజీవి అంటే ఏంటో తెలిసినవాళ్ళు ఈ ప్రచారాన్ని నమ్మలేదు కానీ, కొంతమంది మాత్రం నమ్మారు. దీనికి ఆగ్రహించిన అల్లు అరవింద్ రాజశేఖర్ పై అప్పట్లో పరువు నష్టం దావా వేసాడు. అప్పటి నుండి కోర్టులో నడుస్తున్న ఈ కేసు కి రీసెంట్ గానే తీర్పు వచ్చింది. జీవిత రాజశేఖర్ కి సంవత్సరం పాటు జైలు శిక్ష విదిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు కూడా,కానీ ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు.
అయితే రాజశేఖర్ కూతురు శివాత్మిక చిరంజీవికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మా నాన్న మీద ఉన్న కేసు ని వెనక్కి వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రాధేయపడిందట. రాజశేఖర్ , జీవితలు కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులూ బలవంతం చెయ్యడం వల్ల అలా చెప్పాల్సి,దయచేసి మమల్ని క్షమించి ఆ కేసు ని వెనక్కి తీసుకోవాల్సిందిగా చిరంజీవిని రిక్వెస్ట్ చేశారట. మరి చిరంజీవి మనసు కరుగుతుందో లేదో చూడాలి.