https://oktelugu.com/

Model Schools : ‘ఆదర్శా’న్ని వదిలేసిన కేసీఆర్

విద్య అధికారుల చిన్నచూపుతో నాణ్యమైన విద్యకు దూరమవుతున్న మధ్యతరగతి నిరుపేద విద్యార్థులను కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల నిధులతో మొదలైన ఆదర్శ పాఠశాలలు.. నేడు అధ్వాన్న దిశగా పయనమవుతున్నాయి..

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2023 / 07:46 AM IST
    Follow us on

    Model Schools : ఆర్భాటంగా ప్రారంభించడం.. అనక వదిలేయడం కేసీఆర్ సర్కార్ కు వెన్నతో పెట్టిన విద్య. ఎవరు సమ్మె చేసినా వారిని బెదిరించడం అదలించడం చేస్తుంటారు. ఎన్నికల టైంకు పిలిచి మరీ వారికి వరాలిచ్చి అప్పటిమందం సం‘తృప్తి పరుస్తుంటాడు. వీఆర్ఏలను అలానే అథోగతి పట్టించాడు. ఇప్పుడు వారిని రెగ్యులరైజ్ చేస్తున్నారు. దీని వెనుక వచ్చే ఎన్నికలే కారణం.

    ఇలా వ్యవస్థలను పట్టించుకోకుండా చేయడంలో కేసీఆర్ డిగ్రీ చేసేశారు. తాజాగా పేద పిల్లలకు చదువుల తల్లిగా పేరొందిన ఆదర్శ పాఠశాలలను ఇలానే సంకనాకించే పనిలో బిజీగా ఉన్నారు. ఆదర్శ పాఠశాలలో విద్య పడకేసే పరిస్థితికి వచ్చింది.. ఆదర్శాలను ఆదుకునే నాధుడే లేకుండా పోయాడు. ప్రశ్నించని విద్యాకమిటీలు నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నాయి.

    విద్య అధికారుల చిన్నచూపుతో నాణ్యమైన విద్యకు దూరమవుతున్న మధ్యతరగతి నిరుపేద విద్యార్థులను కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల నిధులతో మొదలైన ఆదర్శ పాఠశాలలు.. నేడు అధ్వాన్న దిశగా పయనమవుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాక పది సంవత్సరాలుగా ఉపాధ్యాయుల కొరత కారణంగా అవర్లి బేస్డ్ ఉపాధ్యాయులను కొనసాగిస్తున్నారు.

    1250 మంది ఉపాధ్యాయులను రాష్ట్రవ్యాప్త౦గా తీసుకున్నారు. కానీ గత ౩ సంవత్సరాలుగా సరైన రెన్యూవల్స్ చేయకపోవడంతో ఆదర్శ పాఠశాలల్లో టీచర్లు లేక పాఠాలు చెప్పేవారే కరువయ్యారు. ఆర్థికశాఖ అనుమతిచ్చిన కూడా అధికారులు బదిలీల పేరుతో కాలయాపన చేస్తుతున్నారు. స్కూల్ లు మొదలై 2 నెలలు కావస్తున్నా సరిపడా ఉపాధ్యాయులు లేక పాఠాలు పూర్తికాక పుస్తకాలలో ఒక్క పాఠం కూడా అవ్వలేదు.

    దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి.. 800 మంది విద్యార్థులకి ఒక్కరే వ్యాయమ ఉపాధ్యాయుడు ఉన్నారు. గ్రంథాలయాలు ఉన్నా లైబ్రేరియన్ లు లేరు ఇలా ఒకటా రెండా.. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఆదర్శ పాఠశాలలను ఆదుకోండని చేతులు చాచి వేడుకుంటున్నా మొద్దు నిద్రలోనే ఉంది అధికార యంత్రాంగం.. కనీసం అవర్లీ బేసిడ్ ఉపాధ్యాయులను రెన్యూవల్ చేస్తే పాఠాలైన చదువుకుంటామని గోడు వెళ్లబోసుకుంటున్న విద్యార్థులు.. కొన్ని సబ్జెక్టు లు పాఠాలు ఇంకా మొదలు కాకపోవడంతో తమ పిల్లలని వేరే స్కూల్ లకి తీసుకెళ్లి జాయిన్ చేద్దామనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు… ఇకనైనా అధికారులు కండ్లు తెరిచి మధ్య తరగతి నిరుపేద విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు …