https://oktelugu.com/

కల తీరకుండానే జయప్రకాశ్‌ రెడ్డి కనుమూశారు

20 ఏండ్లకు పైగా ఇండస్ర్టీ.. 300లకు పైగా సినిమాలు.. రాయలసీమ స్టైల్‌లో డైలాగ్స్‌.. ఏనాడూ బ్రేక్ తీసుకోని కెరియర్‌‌.. మన జేపీ సొంతం. క్యారెక్టర్‌‌ ఆర్టిస్టుగా జయప్రకాశ్‌ రెడ్డి ఎంతో మంది ఆదారాభిమానాలను దోచుకున్నారు. అటు రంగ స్థలంలో.. ఇటు సినిమాల్లో చేస్తూ బిజీ లైఫ్‌ అనుభవించారు. అటు విలన్‌.. ఇటు కమెడియన్‌గా మెప్పించారు. కానీ.. ఆయన చివరి కోరిక తీరకుండానే కనుమూసినట్లుగా తెలుస్తోంది. Also Read: జేపీ మృతిపై స్పందించిన ప్రధాని మోదీ..తెలుగులో నివాళి సినిమాల్లోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 11:59 am
    Jayaprakash reddy

    Jayaprakash reddy

    Follow us on

    Jayaprakash reddy
    20 ఏండ్లకు పైగా ఇండస్ర్టీ.. 300లకు పైగా సినిమాలు.. రాయలసీమ స్టైల్‌లో డైలాగ్స్‌.. ఏనాడూ బ్రేక్ తీసుకోని కెరియర్‌‌.. మన జేపీ సొంతం. క్యారెక్టర్‌‌ ఆర్టిస్టుగా జయప్రకాశ్‌ రెడ్డి ఎంతో మంది ఆదారాభిమానాలను దోచుకున్నారు. అటు రంగ స్థలంలో.. ఇటు సినిమాల్లో చేస్తూ బిజీ లైఫ్‌ అనుభవించారు. అటు విలన్‌.. ఇటు కమెడియన్‌గా మెప్పించారు. కానీ.. ఆయన చివరి కోరిక తీరకుండానే కనుమూసినట్లుగా తెలుస్తోంది.

    Also Read: జేపీ మృతిపై స్పందించిన ప్రధాని మోదీ..తెలుగులో నివాళి

    సినిమాల్లోకి రాక‌ముందు జేపీ నాట‌కాల్లో మెరిశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. ఎంతో ముచ్చటపడి జేపీ ‘అలెగ్జాండర్‌‌’ నాటకం రాయించుకున్నారు. తర్వాతర్వాత దీనిని సినిమా రూపంలో తేవాలని, ప్రేక్షకులకు చేరువ చేయాలని ఆయన అనుకున్నారు. కానీ.. ఆ కల తీరలేదు.

    ‘అలెగ్జాండర్’ నాటకాన్ని జేపీ ఎంతో ఇష్టపడి చేశారు. అయితే చాలా ఏళ్ల కిందటే ప్రముఖ దర్శకుడు ధవల సత్యం సహాయంతో ఈ నాటకాన్ని తెరమీదకు కూడా తీసుకొచ్చారట. వంద నిమిషాల నిడివి ఉన్న ఈ నాటకంలో జయప్రకాశ్‌రెడ్డి ఒక్కరే తెర మీద కనిపిస్తారట. కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్, కొండవలస, రావి కొండలరావు, సాయికుమార్, తెలంగాణ శకుంతల, రఘుబాబు మాటలు ఫోన్లో మాట్లాడుతున్నట్లు వినిపిస్తాయట.

    Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

    సినిమాను పూర్తిచేసినా.. అది విడుదల కాలేదు. దీని విడుదల కోసం జేపీ ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించాలి అంటూ చాలా సందర్భాల్లో జేపీ తన కోరికను బయటపెట్టేవారు. థియేటర్లలో రిలీజ్‌ చేస్తే అంతగా ప్రాముఖ్యం దక్కదని.. అందరూ చూడలేరని భావించి ఓటీటీ ద్వారా అయినా ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఓటీటీ ట్రెండ్‌ నడుస్తుండడంతో ఆ దిశగా జేపీ ప్రయత్నాలు చేస్తుండగానే జేపీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయ‌న క‌ల తీర‌కుండానే మిగిలిపోయింది.